నా కుమారుడిని అలా చేస్తారనుకోలేదు.. ఏడ్చేసిన భోలె షావళి తల్లి | Sakshi
Sakshi News home page

Bhole Shavali: నామినేషన్స్‌.. మా రక్తం ఉడికిపోయింది.. థూ అనేంత తప్పు ఏం చేశాడంటూ భోలె చెల్లి ఫైర్‌

Published Thu, Oct 19 2023 1:05 PM

Bhole Shavali Mother, Sister Gets Emotional Over Nominations - Sakshi

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీల తర్వాత కొత్త జనాభాతో హౌస్‌ కళకళలాడిపోయింది. అటు నామినేషన్స్‌ కూడా మరింత వాడివేడిగా జరిగాయి. ఈ వారం జరిగిన నామినేషన్స్‌ అయితే పీక్స్‌కు వెళ్లిపోయాయి! భోలె షావళి బూతులు మాట్లాడటం.. అతడిని ప్రియాంక, శోభ ఎడాపెడా వాయించేయడం తెలిసిందే! ఈ క్రమంలో ప్రియాంక అతడిని థూ అని చీదరించుకుంది.

నా కొడుకుది ఎంతో మంచి గుణం
తాజాగా ఈ నామినేషన్స్‌ రచ్చపై భోలె షావళి తల్లి, సోదరి స్పందించారు. ముందుగా ఆమె తల్లి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'అంత మంచి మనసున్నవాడు, పది మందికి అన్నం పెట్టే వాడిని హౌస్‌లో అలా చేస్తారనుకోలేదు. నా కొడుకును ప్రియాంక థూ అని ఎందుకు అన్నదో అర్థం కావట్లేదు. నా కొడుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్లినా నా కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. ఎంతో మంచి గుణం వాడిది. అతడితో హౌస్‌లో ఎవరూ మాట్లాడట్లేదు. తను కలుపుకుపోదామని చూస్తున్నా వాళ్లు దూరం పెడుతున్నారు' అంటూ ఏడ్చేసింది.

సీరియల్‌ బ్యాచ్‌ టార్గెట్‌ చేస్తోంది
భోలె చెల్లి మాట్లాడుతూ.. 'మా అన్నయ్య అందరినీ ప్రేమిస్తాడు. కానీ తన మంచితనాన్ని ఓర్వలేకపోతున్నారు. తనకు అతిగా మాట్లాడే అలవాటు లేదు. తనకు నటించడం రాదు. సీరియల్‌ బ్యాచ్‌ మా అన్నయ్యను కావాలని టార్గెట్‌ చేస్తున్నారు. ప్రియాంక  థూ.. అనేంత తప్పు తనేం చేశాడు. శోభా శెట్టి తన మీద పడి అరిచేస్తోంది. అంత అవసరం లేదు. ఆ ఎపిసోడ్‌ చూస్తుంటే మా రక్తం ఉడికిపోయింది. కానీ ఏం చేయలేకపోయాం. శోభా, ప్రియాంక.. హౌస్‌లో మొదటి నుంచి ఆటిట్యూడ్‌ చూపిస్తున్నారు. ఓవరాక్షన్‌ చేస్తున్నారు. సీరియల్స్‌లో నటించినందుకు వారికి ఫ్యాన్స్‌ ఉండొచ్చు. కానీ థూ అని ఊసేంత తప్పు మా అన్నయ్య ఏమీ చేయలేదు. తను ఏం మాట్లాడినా తప్పులాగే చూస్తున్నారు. వాళ్లెంత ఛీ కొట్టినా మా అన్నయ్య మాత్రం కూల్‌గానే మాట్లాడాడు' అని ఫైర్‌ అయింది.

చదవండి: యంగ్ టైగర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక జాబితాలో చోటు!

Advertisement
Advertisement