ప్రెగ్నెంట్‌ అని తెలీక పార్టీలకు వెళ్లి మందు తాగా: కమెడియన్‌ | Bharti Singh Drinks Alcohol a Day Before She Learnt About Being Pregnant | Sakshi
Sakshi News home page

మందు తాగిన కమెడియన్‌.. తెల్లారే ప్రెగ్నెంట్‌ అని తేలింది!

Sep 6 2024 8:34 PM | Updated on Sep 6 2024 8:34 PM

Bharti Singh Drinks Alcohol a Day Before She Learnt About Being Pregnant

ప్రెగ్నెంట్‌ అన్న విషయం తెలియక కమెడియన్‌ భారతీ సింగ్‌ మందు తాగింది. నిజానికి ఏడు వారాల వరకు ఆమెకు తాను గర్భవతి అన్న విషయమే తెలియదు. ఈ విషయాన్ని భారతీ సింగ్‌ స్వయంగా వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా ప్రెగ్నెన్సీని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. 

ఎంజాయ్‌ చేశా
అప్పటిదాకా పార్టీలకు వెళ్తూ హాయిగా నచ్చింది తింటూ, తాగుతూ ఎంజాయ్‌ చేశాను. అనుకోకుండా ఓ రోజు ప్రెగ్నెన్సీ కిట్‌ కనిపించడంతో ట్రై చేద్దామనుకున్నాను. తీరా పరీక్షిస్తే పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని నా భర్త హార్ష్‌కు చెప్తే అతడు నమ్మలేదు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేస్తే గర్భవతినని నిర్ధారణ అయింది. 

ఆడవారిదే తప్పంటారు!
గర్భంలో ఉన్న శిశువుకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా మహిళదే తప్పంటారు చాలామంది. అయితే భర్త మానసికంగా ధైర్యం చెప్తూ అండగా ఉంటే ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీని హ్యాండిల్‌ చేయడం చాలా ఈజీ. నాకు అలా అర్థం చేసుకునే భర్త దొరికాడు అని చెప్తూ మురిసిపోయింది. 

ముచ్చటైన కుటుంబం
కాగా భారతి సింగ్‌.. రచయిత, నిర్మాత, యాంకర్‌ హార్ష్‌ లింబాచియాను ప్రేమించింది. వీరిద్దరూ కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో గోలా పుట్టాడు. తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను భారతీ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement