తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ | Bharat Bhushan Elected as Telugu Film Chamber of Commerce President | Sakshi
Sakshi News home page

తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్.. ఉపాధ్యక్షుడిగా..

Jul 28 2024 1:18 PM | Updated on Jul 29 2024 1:08 PM

Bharat Bhushan Elected as Telugu Film Chamber of Commerce President

హైదరాబాద్‌: తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్‌ ఎన్నికయ్యారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా అశోక్‌ కుమార్‌ గెలిచారు. ఆదివారం ఉదయం జరిగిన ఫిలిం ఛాంబర్‌ (టీఎఫ్‌సీసీ) ఎన్నికల్లో మొత్తం 48 మంది సభ్యులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా అధ్యక్ష బరిలో ఉన్న భరత్‌ భూషణ్‌కు 29 ఓట్లు, ఠాగూర్‌ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష బరిలో ఉన్న అశోక్‌ కుమార్‌కు 28 ఓట్లు, వైవీఎస్‌ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి.

కాగా గతేడాది నిర్మాతల విభాగం నుంచి దిల్‌ రాజు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆయన పదవీకాలం ముగియడంతో నేడు మళ్లీ ఎలక్షన్స్‌ నిర్వహించారు. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్‌ విభాగం నుంచి ఠాగూర్‌ మధు (నెల్లూరు), భరత్‌ భూషణ్‌ (విశాఖపట్టణం) బరిలో నిలిచారు. ఉపాధ్యక్ష పదవికి మాత్రం నిర్మాతలైన అశోక్‌ కుమార్‌, వైవీఎస్‌ చౌదరి పోటీపడ్డారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి నాలుగు సెక్టార్స్‌లోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

చదవండి: నేను, మహేశ్‌బాబు హీరోయిన్‌ను ఏడిపించాం: సుధ

Advertisement
 
Advertisement
Advertisement