ఆ సినిమాతో బాగా నష్టపోయాం.. ఇప్పట్లో నో రీమేక్‌: నిర్మాత | Bhaag Saale producer Arjun Dasyan on press meet | Sakshi
Sakshi News home page

ఆ సినిమాతో బాగా నష్టపోయాం.. ఇప్పట్లో నో రీమేక్‌: నిర్మాత

Jul 5 2023 4:02 AM | Updated on Jul 5 2023 6:46 AM

Bhaag Saale producer Arjun Dasyan on press meet - Sakshi

శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘భాగ్‌ సాలే’. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో అర్జున్‌ దాస్యన్, యష్‌ రంగినేని, కళ్యాణ్‌ సింగనమల నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప‍్రొడక్షన్స్‌ ద్వారా ఈ నెల 7న విడుదల కానుంది.

ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అర్జున్‌ దాస్యన్‌ మాట్లాడుతూ– 'కష్టపడకుండా తక్కువ టైమ్‌లో జీవితంలో ఎదగాలనుకునే అర్జున్‌ అనే ఓ కుర్రాడి లైఫ్‌ ఫైనల్‌గా ఏమైంది? అన్నదే కాన్సెప్ట్‌. అర్జున్‌ పాత్రలో శ్రీ సింహానటించారు. దర్శకుడు ప్రణీత్‌ కథ చెప్పినదాని కంటే పదిరెట్లు బాగా తీశాడు. ‘కార్తికేయ 2’లోలా ఈ చిత్రంలోనూ కృష్ణుడి కాన్సెప్ట్‌ ఉంటుంది.

ఆ సినిమాకి ఇచ్చినట్లే ఈ సినిమాకి  కూడా కాలభైరవ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఇక నేను నిర్మించిన ‘డియర్‌ మేఘ’ చిత్రం కన్నడ ‘దియా’కు రీమేక్‌. కారణాలు తెలియదు కానీ ‘డియర్‌ మేఘ’ విడుదలైన రోజే ‘దియా’ యూ ట్యూబ్‌లో విడుదలైంది. మాకు బాగా నష్టం కలిగింది. సో.. ఇప్పట్లో రీమేక్‌ మూవీ చేయకూడదనుకుంటున్నాను. అలాగే కొందరు నిర్మాతల అసోసియేషన్‌తోనే డైరెక్షన్‌ చేద్దామని అనుకుంటున్నాను. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా తీస్తున్నాం. హిందీలో  రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నాం' అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement