Aindrila Sharma: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ యువనటి మృతి

Bengali actor Aindrila Sharma passes away At the Age Of 24 - Sakshi

ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ కన్నుమూశారు. 24 ఏళ్ల నటి ఇప్పటికే చాలాసార్లు గుండెపోటుకు గురయ్యారు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.  బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నవంబర్ 1న ఆమె ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఇప్పటికే ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఆమె సర్జరీ చేయాల్సి వచ్చింది.

నవంబర్ 14న పలుమార్లు ఆమె గుండెపోటు రావడంతో  ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.  పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఒకరోజు ముందే అండ్రిలా శర్మ బాయ్‌ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి ఆమె బతకాలని ప్రార్థించమని సోషల్ మీడియాలో  అభిమానులను కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో ఆండ్రిలా పుట్టి పెరిగారు. ఆమె జుమూర్‌తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మహాపీఠ్ తారాపీఠ్, జిబోన్ జ్యోతి, జియోన్ కతి వంటి షోలలో నటించింది. ఆండ్రిలా అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లో కూడా భాగమైంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top