breaking news
bengal hospital
-
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ యువనటి మృతి
ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ కన్నుమూశారు. 24 ఏళ్ల నటి ఇప్పటికే చాలాసార్లు గుండెపోటుకు గురయ్యారు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నవంబర్ 1న ఆమె ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఇప్పటికే ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఆమె సర్జరీ చేయాల్సి వచ్చింది. నవంబర్ 14న పలుమార్లు ఆమె గుండెపోటు రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఒకరోజు ముందే అండ్రిలా శర్మ బాయ్‌ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి ఆమె బతకాలని ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులను కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో ఆండ్రిలా పుట్టి పెరిగారు. ఆమె జుమూర్‌తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మహాపీఠ్ తారాపీఠ్, జిబోన్ జ్యోతి, జియోన్ కతి వంటి షోలలో నటించింది. ఆండ్రిలా అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లో కూడా భాగమైంది. -
బెంగాల్ ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారుల మృతి
పశ్చిమబెంగాల్లోని మాల్డా వైద్య కళాశాల ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారులు మరణించారు. వీరంతా తక్కువ బరువుతో పుట్టారని, ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే వాళ్లందరి ఆరోగ్యం చాలా విషమించిందని మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ ఎంఏ రషీద్ తెలిపారు. ఇటీవలి కాలంలో కూడా ఈ ప్రభుత్వాస్పత్రిలో తరచు చిన్నారులు మరణించిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జూన్ నెలలో మెదడువాపు కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోగా, జనవరిలో డజను మందికి పైగా పిల్లలు అంతుతెలియని వ్యాధితో మరణించారు.