Bellamkonda Ganesh's 'Nenu Student Sir' movie gets postponed - Sakshi
Sakshi News home page

Bellamkonda Ganesh: వాయిదా పడిన బెల్లంకొండ గణేష్‌ మూవీ.. కారణమిదే!

Feb 27 2023 5:07 PM | Updated on Feb 27 2023 5:31 PM

Bellamkonda Ganesh Nenu Student Sir Movie Postponed - Sakshi

బెల్లండకొండ గణేశ్‌ నటిస్తున్న రెండో చిత్రం నేను స్టూడెంట్‌ సర్‌.రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  అవంతిక దస్సానీ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైప పోస్టర్స్‌, టీజర్‌ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్‌ చేసింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను 10న విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. అయితే తాజాగా రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విద్యర్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సినిమాను వాయిదా వేస్తున్నాం.

త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తాం. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌. వేసవి సెలవుల్లో కలుద్దాం అంటూ మేకర్స్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా ఓ కాలేజీ స్టూడెంట్‌కి ఎదురైన సమస్య నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement