నాడు చిరంజీవిపై ట్రోల్స్‌.. నేడు బాలకృష్ణను ఏమనాలి? | Balakrishna To Ground Floor Comments, Trolled By Netizens | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ ఇలా ఉన్నాడు కాబట్టే.. చంద్రబాబు ఆపని ఎప్పుడో చేసేశాడు

Oct 13 2023 3:16 PM | Updated on Oct 13 2023 3:24 PM

Balakrishna To Ground Floor Comments Troll By Netizens - Sakshi

ఒక సినిమా విడుదలకు రెడీగా ఉందంటే ఆ సమయంలో  పలు వేదికలపై చేసే హీరో ప్రసంగం కీలకం. కానీ బాలకృష్ణ సినిమాలకు అలాంటి పరిస్థితి వుండదు. ఆయన స్పీచ్‌ ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లిపోతాడు. ఎంతో సమయం మాట్లాడినా సినిమాకు చెందిన సబ్జెక్ట్ గురించి మాత్రం అస్సలు మాట్లాడే ప్రసక్తే ఉండదు. ఒక్కోసారి తన సినిమాకు పనిచేసిన కొందరి టెక్నీషియన్ల పేర్లు కూడా ఆయనకు గుర్తుకు ఉండవు.

ఆయన మాట్లాడే సమయంలో ఎవరైనా నవ్వినారు అనుకో చచ్చారే.. వారిపై అసహనంతో ఊగిపోవడం తప్ప బాలయ్య చేసేదేమీ లేదు. ఎల్లప్పుడూ రోజులు ఒకలా ఉండవు. ఓ రోజు వస్తుంది. బ్లడ్డు బ్రీడు పూచికపుల్లకూ కొరగావు. బూతులు, కోపాలు, తన్నులు. కొట్టడం వంటివి ఎల్లకాలమూ సాగవు. బాలయ్య ఇలా ఉన్నాడు కాబట్టే NTR వారసత్వాన్ని లోకేష్‌ భుజంపై చంద్రబాబు ఎప్పుడో పెట్టేశాడు.

బాలయ్య నీతులకు మాత్రమే పరిమితం
సీనియర్‌ ఎన్టీఆర్‌ గారు జీవించి ఉన్న రోజుల్లో ఆడవారికి ప్రథమ గౌరవం ఇచ్చేవారు అని తెలిసిందే. కానీ ఆయనకు వారసుడిగా ఉండాల్సిన బాలకృష్ణ.. కుమారుడిగా మాత్రమే మిగిలిపోయాడు. ఆడది కనిపిస్తే కడుపు అయినా చెయ్యాలి.. ముద్దు అయినా పెట్టాలి అని బాలయ్య చేసిన చిల్లర కామెంట్లు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ వ్యాఖ్యలకు తోడు  భగవంత్ కేసరి సినిమా వేదికపై బాలయ్య చేసిన 'గ్రౌండ్ ఫ్లోర్' కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా వేదికపై  కొడుకు గురించి మాటలు చెబుతూ తన చేతిని ఓ విధంగా ఊపారు. ఈ మధ్య ఇలా ఊపడం అన్నది బాలయ్యకు బాగా అలవాటు అయినట్లుంది. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో కూడా అలాగే ఊపారు. కానీ పక్కన కూతురు వయసు ఉన్న శ్రీలీల లాంటి చిన్న అమ్మాయిని పెట్టుకుని ఇలాంటి చిల్లర చేష్టలు చేయడం బాలకృష్ణకే సాధ్యం అని చెప్పవచ్చు. 

నాడు చిరంజీవిపై ట్రోల్స్‌ 
భోళాశంకర్‌లో చెల్లెలిగా నటించిన కీర్తి సురేష్ చేతిని ఆఫ్ స్క్రీన్‌లో చిరంజీవి సరదాగా పట్టుకున్నారనే గదా మెగాస్టార్‌ను నీ ఫ్యాన్స్‌ ట్రోల్ చేశారు. మరి సినిమాలో కూతురిగా నటించిన శ్రీలీలతో హీరోగా రొమాన్స్‌ చేయాలని ఉందనే గ్రౌండ్ ఫ్లోర్ లాంటి వ్యాఖ్యలు చేసిన నిన్ను ఏమని అనాలి..? చెప్పు బాలయ్య అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

జైల్లో బావ.. స్టేజ్ పై బాలయ్య 
జైల్లో బావ.. స్టేజ్ పై బాలయ్య అంటే రాజకీయ స్టేజీపై అనుకునేరు.. కాదు.. కాదు. చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత టీడీపీని న‌డిపే నాయ‌కుడెవ‌ర‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. పార్టీని లోకేశ్ ముందుకు న‌డిపిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. తీరా చూస్తే, అంద‌రి కంటే ముందు ఏకంగా రాష్ట్రాన్ని వ‌దిలిపెట్టి సుమారు 30రోజుల పాటు ఢిల్లీలో దాక్కుని చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఈ లోపు హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ యాక్టీవ్ అయ్యాడు. ఏకంగా మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో చంద్ర‌బాబు సీట్లో బాల‌య్య ఆసీనుల‌య్యారు.

తరుచూ చిల్లర వ్యాఖ్యలు చేస్తూ చెడ్డపేరు తెచ్చుకుంటున్న  బాల‌కృష్ణ చేతిలోకి టీడీపీ ప‌గ్గాలు ఎక్కడ వెళ్తాయోనని చంద్ర‌బాబు గ్రహించారు. తన బుర్రకు పనిచెప్పి బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రిల‌ను వెంట‌నే తెర‌పైకి తెచ్చారు. తెలంగాణ‌లో ఊసేలేని తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని బాలయ్యకు కట్టబెట్టారు. దీంతో ఏపీ వైపు బాలయ్య కన్నెత్తి చూడకుండా జైళ్లో నుంచే   చంద్రబాబు స్కెచ్‌ వేశాడు. జైల్లో ఉన్న తన బావ చంద్రబాబు పక్కాగా రాజకీయ చదరంగం ఆడుతూ బాల‌య్య‌ను ఏపీ నుంచి త‌ప్పిస్తే... నంద‌మూరి బాల‌కృష్ణ తన  అజ్ఞానంతో స్టేజీలపై ఇలా చిల్లర వ్యాఖ్యలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement