ఇండియాలో ముందుగానే రిలీజ్‌ కానున్న హాలీవుడ్‌ మూవీ! | 'Bad Boys: Ride Or Die' Will Release One Day Before In India | Sakshi
Sakshi News home page

Bad Boys Ride or Die: ఒక రోజు ముందుగానే రిలీజవుతోన్న 'బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై'

Jun 5 2024 10:22 PM | Updated on Jun 6 2024 9:45 AM

'Bad Boys: Ride Or Die' Will Release One Day Before In India

విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై.  ప్రముఖ ఫ్రాంచైజీలో నిర్మించిన ఈ చిత్రానికి  ఆదిల్,  బిలాల్‌ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఒక రోజు ముందుగానే భారతదేశం అంతటా భారీ స్థాయిలో  జూన్ 6న విడుదలవుతోంది. ఈ యాక్షన్-అడ్వెంచర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.

అత్యంత జనాదరణ పొందిన యాక్షన్-కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన బ్యాడ్ బాయ్స్ నాల్గొ విడత గురువారం రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం జూన్ 6వ తేదీన భారతదేశంలో ఒక రోజు ముందుగా విడుదల కావడంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్‌తో టిఫనీ హడిష్, జో పాంటోలియానో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement