Baby Movie Crossed KGF 2 Collections in a Row 13 Days - Sakshi
Sakshi News home page

Baby Movie: బేబీ కలెక్షన్ల సునామీ.. కేజీఎఫ్‌-2 రికార్డ్‌ బ్రేక్‌!

Jul 27 2023 8:53 PM | Updated on Jul 27 2023 9:33 PM

Baby Movie Crossed KGF 2 Collections In A Row 13 Days - Sakshi

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం బేబీ. ట్రయాంగిల్ లవ్‌ స్టోరీగా రూపొందించి ఈ చిత్రం కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా.. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం మౌత్‌టాక్‌తో రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.70 కోట్ల మార్కును దాటేసిన బేబీ మూవీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

(ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్)

ఈసారి ఏకంగా కన్నడ స్టార్ యశ్ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ మూవీ  కేజీఎఫ్‌-2 రికార్డ్‌ను బద్దలుకొట్టింది. గతంలో కేజీఎఫ్-2 వరుసగా 12 రోజుల పాటు రోజుకు రూ.కోటి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం వరుసగా 13 రోజుల పాటు కోటికి పైగా వసూళ్లను రాబట్టి కేజీఎఫ్‌ను వెనక్కి నెట్టింది.  ఈ చిత్రం రిలీజై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్లపరంగా ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండ చిత్రం అర్జున్ రెడ్డి కలెక్షన్లను దాటేసిన బేబీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.  

(ఇది చదవండి: ముంబయిలో ఫ్లాట్.. నాలుగు రోజులు నరకం చూశా: హీరోయిన్)

Advertisement
 
Advertisement
Advertisement