'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్? | Baby Fame Vaishnavi Chaitanya Will Soon Tell Good News | Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: శుభవార్త చెప్పబోతున్న వైష్ణవి చైతన్య.. ఏంటది?

Jun 2 2024 8:50 PM | Updated on Jun 3 2024 9:53 AM

Baby Fame Vaishnavi Chaitanya Will Soon Tell Good News

'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందా? ఏమో మరి ఓ షోలో ఈమె సహ నటుడే ఈ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో అది ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పబోయే శుభవార్త ఏంటి? ఇంతకీ ఏం చెప్పాడు?

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య.. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఎప్పుడైతే 'బేబి' మూవీలో హీరోయిన్‌గా చేసిందో ఈమె దశ తిరిగిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్ల ఈమెకు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి ఛాన్సులు వస్తున్నాయి. రీసెంట్‌గా 'లవ్ మీ' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.

(ఇదీ చదవండి: ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్‌గా 'పరువు' ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'సుమ అడ్డా' షోలో పాల్గొన్నారు. అయితే అందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ చోట హీరో అశిష్.. వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందని అన్నాడు. వెంటనే అందుకున్న సుమ.. రీసెంట్‪‌గా పెళ్లి జరిగింది నీకు, చెబితే నువ్వు చెప్పాలి అని సెటైర్ వేసింది.

మరి వైష్ణవి చైతన్య నుంచి గుడ్ న్యూస్ అంటే పెళ్లి ఏమైనా చేసుకోబోతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే ఏదైనా పెద్ద మూవీలో హీరోయిన్‌గా అవకాశమైనా వచ్చి ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. శంకర్ మార్క్ కనబడట్లేదే?)

Advertisement
 
Advertisement
Advertisement