ఇంటికి చేరుకున్న అతియా శెట్టి.. కేఎల్ రాహుల్ వారసురాలికి ఘనస్వాగతం! | Athiya Shetty shares glimpse of homecoming after embracing motherhood | Sakshi
Sakshi News home page

Athiya Shetty: ఇంటికి చేరుకున్న అతియా శెట్టి.. కేఎల్ రాహుల్ వారసురాలికి ఘనస్వాగతం!

Mar 28 2025 6:57 PM | Updated on Mar 28 2025 7:30 PM

Athiya Shetty shares glimpse of homecoming after embracing motherhood

టీమిండియా స్టార్‌ క్రికెటర్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈనెల 24న పాప తమ జీవితంలోకి అడుగుపెట్టిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత పలువురు సినీతారలు, అభిమానులు అతియా శెట్టి దంపతులకు అభినందనలు తెలిపారు.

అయితే తాజాగా అతియా శెట్టి తన బిడ్డతో కలిసి ఇంటికి చేరుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సందర్భంగా గ్రాండ్ వెల్‌కమ్‌ లభించింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. పూలు, కుంకుమతో తనకు స్వాగతం పలికి ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అతియా పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోటోలో 'ఓం' దేవుడి పేరును కూడా ప్రస్తావించింది.

kl

కాగా.. అతియాశెట్టి, కేఎల్ రాహుల్ గతేడాది నవంబర్ 2024న అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పారు.  తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రెండు వారాల క్రితమే అతియా శెట్టి తన ప్రసూతి ఫోటోషూట్  చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతకుముందు కేఎల్, అతియా 2019లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ సినీతారలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌ వెడ్డింగ్ వేడుక జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement