పెళ్లికి రెడీ అయిన హీరో విశ్వక్‌ సేన్‌.. ముహూర్తం ఫిక్స్‌ | Ashoka Vanam Lo Arjuna Kalyanam All Set To Release | Sakshi
Sakshi News home page

Ashoka Vanamlo Arjuna Kalyanam Movie: 'అశోకవనంలో అర్జున కల్యాణం' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Feb 5 2022 7:20 PM | Updated on Feb 5 2022 7:45 PM

Ashoka Vanam Lo Arjuna Kalyanam All Set To Release - Sakshi

Ashoka Vanam Lo Arjuna Kalyanam All Set To Release: హీరో విశ్వక్‌ సేన్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మాంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ఒకరు.  'వెళ్లిపోమాకే' సినిమాతో పరిచయం అయిన ఈ యంగ్‌ హీరో ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్, పాగల్‌ వంటి విభిన్న చిత్రాల్లో నటించి మెప్పించాడు. తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.  పెళ్లి కోసం ఆరాటపడే మిడిల్‌ క్లాస్‌ యువకుడిలా కనిపించి మంచి ఆసక్తి రేపిన విశ్వక్‌ సేన్‌ ఫైనల్‌గా తన పెళ్లి తేదీతో కూడిన పోస్టర్‌తో సినిమా రిలీజ్‌ను ప్రకటించాడు. మార్చి4న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక విశ్వక్‌సేన్‌కు జోడీగా  రుక్సార్ థిల్లోన్ అలరించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement