ఆర్యన్‌ ఖాన్‌ పాత వీడియో వైరల్‌

Aryan Khan Old video Helping Beggar Girl Goes Viral - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం తెలిసిందే. ముంబై తీరంలోని ఓ క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన ఎన్‌సీబీ అధికారులు ‍స్టార్‌ కొడుకుతోపాటు మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. ఈ కేసు హిందీ చిత్ర పరిశ్రమని కుదిపేసింది. అయితే ఈ తరుణంలో ఆర్యన్‌ పాత వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

ముంబైలోని బస్తిన్ రెస్టారెంట్ పార్టీ చేసుకున్న ఆర్యన్‌, మలైకా అరోరా, ఇతర స్నేహితులతో కలిసి బయటకి వచ్చాడు. ఆ సమయంలో అక్కడికి చిన్నారితో పాటు వచ్చిన ఓ బెగ్గర్‌ చేతిని చాచాగా, తన జేబులో ఉన్న మనీని తీసి ఇచ్చేశాడు. కాగా, ఎన్‌సీబీ కస్టడీలో ఉన్న ఆర్యన్‌ తాను నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో 2018లో వచ్చిన ఈ వీడియోని ఆర్యన్‌ ఎంతో మంచి వ్యక్తి అంటూ షారుక్ అభిమానులు వైరల్‌ చేస్తున్నారు.

చదవండి: ఆర్యన్‌ ఖాన్‌ చిన్నపిల్లాడు.. రిపోర్టులు రానివ్వండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top