స్టార్ హీరో తొలి వెబ్ సిరీస్.. ఆ ఒక్కదానికే రెండేళ్లు టైమ్! | Arya's The Village Web Series Trailer And OTT Release Date | Sakshi
Sakshi News home page

The Village Series: స్టార్ హీరో తొలి వెబ్ సిరీస్.. ఆ ఒక్కదానికే రెండేళ్లు టైమ్!

Published Sun, Nov 19 2023 5:04 PM | Last Updated on Mon, Nov 20 2023 10:29 AM

Arya The Village Web Series Trailer And OTT Release Date - Sakshi

ఇప్పుడంతా ఓటీటీల ట్రెండ్ నడుస్తోంది. దీంతో సినిమా హీరోలు కూడా చాలామంది వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. నాగచైతన్య త్వరలో 'దూత' అనే సిరీస్‌తో రాబోతున్నాడు. దీనికంటే ముందు తమిళ స్టార్ హీరో ఆర్య.. 'ద విలేజ్' అనే హారర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయ్.

(ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!)

'ద విలేజ్' సిరీస్ నవంబరు 24 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ప్రైమ్‌ వీడియో ప్రెసిడెంట్ అపర్ణ పురోహిత్‌ హాజరయ్యారు. 'ది విలేజ్' వెబ్‌ సిరీస్‌‌తో ప్రేక్షకులని తాము నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ సిరీస్ కోసం దాదాపు నాలుగేళ్లు జర్నీ చేసినట్లు పేర్కొన్నారు. ఇకపోతే ఈ స్ట్రిప్ట్‌ని రాసి చదవడానికే రెండేళ్లు పట్టిందన్నారు. 

అలానే నటుడు ఆర్య నటించడానికి అంగీకరించడంతో ఇది చాలా భారీ సిరీస్‌ అయిందనే అభిప్రాయాన్ని అపర్ణ పురోహిత్ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగే పలు ఘటనలను ఒక చోటకు తీసుకురావడం ఎలా? అనే ఆసక్తికరమైన స్టోరీతో ఈ సిరీస్ తీసినట్లు నిర్మాత బీఎస్ రాధాకృష్ణ చెప్పారు. 

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఫస్ట్ మూవీ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement