ఓటీటీలో పాన్‌ ఇండియా సినిమా స్ట్రీమింగ్‌ | ARM Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో పాన్‌ ఇండియా సినిమా స్ట్రీమింగ్‌

Nov 1 2024 3:03 PM | Updated on Nov 1 2024 3:17 PM

ARM Movie OTT Streaming Date Locked

మలయాళ నటుడు టొవినో థామస్‌- కృతిశెట్టి జోడీగా నటించిన కొత్త సినిమా 'ఏఆర్‌ఎం' (అజయంతే రంధం మోషణమ్‌) (ARM). సెప్టెంబర్ 12న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. జితిన్ లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సురభి లక్ష్మి, ఐశ్వర్య రాజేష్,  రోహిణి వంటి వారు నటించారు. మిన్నల్‌ మురళి, 2018 వంటి డబ్బింగ్‌ చిత్రాలతో  టొవినో థామస్‌కు టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు ఉంది.

టొవినో థామ‌స్‌కు 50వ చిత్రంగా విడుదలైన 'ఏఆర్ఎం' భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది. ఇంతటి విజయాన్ని దక్కించుకున్న ఈ చిత్రం నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ తెలిపింది. మలయాళంతో పాటు తెలుగు,తమిళ్‌,కన్నడ,హిందీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది.

వేర్వేరు కాలాల్లో సాగే మూడు త‌రాల క‌థ ఇది. డైరెక్టర్‌ జితిన్‌లాల్‌కు ఇదే తొలి చిత్ర‌మైనప్పటికీ తెరకెక్కించిన తీరు చాలా బాగుంటుంది. నిధి అన్వేష‌ణ‌తో కూడిన ఆస‌క్తిక‌ర‌మైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించాడు. ఈ మూవీకి ప్రధాన బలం కూడా ఇదే కావడం విశేషం. 90ల కాలం నాటి అమ్మాయిగా కృతిశెట్టి పాత్ర ఆకట్టుకుంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement