ప్రతి ఒక్కరూ మెచ్చే 'ఇద్దరు': హీరోయిన్ సోనీ | Arjun Sarja Iddaru Movie Sony Charishta | Sakshi
Sakshi News home page

Iddaru Movie: అర్జున్ కొత్త సినిమా రిలీజ్‌కు రెడీ

Jul 5 2023 5:34 PM | Updated on Jul 5 2023 5:35 PM

Arjun Sarja Iddaru Movie Sony Charishta - Sakshi

యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి (కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య), సోని చరిష్టా హీరోహీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇద్దరు'. ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించారు. ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 

ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరోయిన్లలో ఒకరైన సోని చరిష్టా మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సమీర్ కి నా కృతజ్ఞతలు. యాక్షన్ కింగ్ అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. 'ఇద్దరు' అనే ఈ చిత్రం నా కెరీర్ లో ఓ మైలురాయి. చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నిర్మాత ఫర్హీన్ ఫాతిమాకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్' అని అన్నారు.

(ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస‍్తున్న స్టార్ హీరోలు!)

Advertisement
 
Advertisement
Advertisement