'ఇద్దరు' సినిమా రివ్యూ | Arjun Sarja Iddaru Movie Review Telugu | Sakshi
Sakshi News home page

Iddaru Movie Review: అర్జున్ 'ఇద్దరు' రివ్యూ.. ఎలా ఉందంటే?

Oct 19 2024 12:27 PM | Updated on Oct 19 2024 12:27 PM

Arjun Sarja Iddaru Movie Review Telugu

ఒకప్పుడు తెలుగులో నటించిన అర్జున్, జేడీ చక్రవర్తి చాలా ఏళ్ల క్రితం 'ఇద్దరు' అనే సినిమాలో హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
అర్జున్ ఓ మల్టీ మిలియనీర్. ఈయన కంపెనీలో జేడీ చక్రవర్తి ఉద్యోగిగా చేరతాడు. రాత్రి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలనేది ఇతడి ఆశ. ఈ క్రమంలో తన బాస్ అర్జున్‌పై ఒక అమ్మాయితో హనీట్రాప్ చేయాలని చూస్తాడు. ఇది గ్రహించిన అర్జున్.. దానికి పై ఎత్తు వేస్తాడు. ఆ తర్వాత ఏమేం జరిగిందనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)

ఎలా ఉందంటే?
ఇద్దరు తెలివైన వ్యక్తుల.. ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తుల వేస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ఇద్దరు'. వేల కోట్లకు అధిపతి అయిన అర్జున్‌ని హానీ ట్రాప్ చేసి కోటీశ్వరుడు కావాలనుకునే ఉద్యోగిగా జేడీ చక్రవర్తి కనిపించాడు. అతని ఎత్తులను పసికట్టి అతని ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. ఇలా సినిమా మొత్తం ట్విస్టులో బాగానే తీశారు. దర్శకుడు పర్లేదనిపించాడు. అక్కడక్కడ బోర్ కొట్టించినా.. కమర్షియల్ అంశాలు బాగానే దట్టించారు.

ఎవరెలా చేశారు?
అర్జున్, జేడీ తమ పాత్రలకు న్యాయం చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా ఓకే ఓకే. మిగిలిన విభాగాల వాళ్లు తమ తమ పని సక్రమంగా నిర్వర్తించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ 'సత్యం సుందరం' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement