‘లోదుస్తులతో ఫోటోలు షేర్‌.. నీ రేటెంత’ | Anurag Kashyap Daughter Aaliyah Gets Trolled For Lingerie Photos | Sakshi
Sakshi News home page

‘వేశ్య.. నీ రేటెంత అని అడుగుతున్నారు’

Feb 19 2021 11:38 AM | Updated on Feb 19 2021 1:44 PM

Anurag Kashyap Daughter Aaliyah Gets Trolled For Lingerie Photos - Sakshi

నన్ను వేశ్యగా సంబోధిస్తూ.. అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదరిస్తున్నారు.

ఆలియా కశ్యప్‌.. ఈ పేరు ఎవరకీ పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్‌ ఇండస్ట్రీకి మాత్రం తెలిసిన ముఖమే. సినీ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అతని మొదటి భార్య ఆర్తి బజాజ్‌ కూతురే ఆలియా కశ్యప్‌. ప్రస్తుతం ఈమె అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల ఆలియా ఓ వీడియోను పోస్టు చేస్తూ అందులో తనకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. లోదుస్తులతో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం వల్ల విపరీతమైన ట్రోలింగ్‌కు గురైనట్లు వెల్లడించారు. ట్రోలింగ్‌ ఆమెను ఎంతలా ప్రభావితంచేసిందో చెబుతూ దాని నుంచి ఎలా బయటపడ్డారో వివరించారు. తనను వేశ్యగా సంబోధిస్తూ.. అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదరింపులు అందినట్లు పేర్కొన్నారు. లోదుస్తులలో దిగిన ఫోటోలను పోస్టు చేయడం వల్ల ఎదురైన విమర్శల గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడారు. 

‘సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ వల్ల నాకు ఓ విషయం అర్థమైంది. నేను ఎంత సున్నిమైన వ్యక్తినో, చిన్న వ్యతిరేకత కూడా నన్ను ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నాను. ఇప్పటి వరకు నాకస్సలు తెలీదు.. నేనింత సెన్సిటీవ్‌ అని. ఈ విషయం తెలిసి ప్రతిరోజు ఏడ్చాను. నేనొక భారతీయురాలిని కావడం వల్ల అలాంటి విషయాలు పోస్ట్ చేయడంతో సిగ్గుపడాలని ప్రజలు నాకు చెప్తున్నారు. ఇందుకు నన్ను రేప్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. నన్ను వేశ్య అని పిలుస్తూ.. నా 'రేటు' ఎంతని అడుగుతున్నారు. చంపేస్తామని నన్ను, నా కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇదంతా కేవలం ఆ ఫోటోలు పోస్టు చేయడం వల్లే జరిగింది.

దీని కారణంగా చాలా బాధపడ్డాను. మానసికంగా ఎంతో కుంగిపోయాను. కానీ తరువాత అర్థమైంది. అనామక ముసుగు వెనుక దాక్కున్న ట్రోల్స్‌ నేను ప్రభావితం కాదని. ఎవరైతే పని లేకుండా ఖాళీగా ఉన్నారో వారే వీటి గురించి పట్టించుకుంటారు. వాళ్లందరినీ నేను నిజాయితీగా బ్లాక్ చేస్తాను. నా సోషల్ మీడియాలో ఏదైనా ప్రతికూలంగా ఉంటే, నేను దాన్ని బ్లాక్ చేస్తాను. ఎందుకంటే. నా సోషల్ మీడియా ఎప్పుడూ సానుకూల ప్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

కాగా తనకు సినీ పరిశ్రమలోకి వచ్చే ఆలోచన లేదని ఆలియా వెల్లడించారు. బాలీవుడ్‌ గ్లామర్‌తో ఎదగలేదని కుండబద్దలు కొట్టినట్లు పేర్కొన్నారు. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానన్నారు. ఇదిలా ఉండగా 1997తో ఈనురాగ్ కశ్యప్‌ ఫిల్మ్ ఎడిటర్ ఆర్తి బజాజ్‌ను వివాహం చేసుకున్నాబు. వీరికి ఆలియా అనే కుమార్తె ఉంది. అయితే, ఈ జంట 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2013 లో 'దేవ్‌డీ' చిత్రనిర్మాత నటి కల్కి కోచ్లిన్‌ను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెతో కూడా 2015లో విడాకులు తీసుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement