హీరోయిన్‌ మెటిరియల్‌ కాదన్న నెటిజన్‌.. అదే రేంజ్‌లో రిప్లై ఇచ్చిన అనుపమ

Anupama Parameswaran React Social Media Comments Latest Viral - Sakshi

తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్‌. సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. 'అఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. కానీ ఆమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశం దక్కలేదు.

ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో ఈ  బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టట్‌లో ఉంటుంది.

(ఇదీ చదవండి : కారు ప్రమాదం... షాక్‌లోకి వెళ్లిపోయానన్న నటి)

తాజాగా ఒక నెటిజన్‌  'నువ్వు పెద్ద హీరోయిన్‌వి ఏమీ కాదు.. అందుకే భారీ సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు.. అసలు మీరు హీరోయిన్‌ మెటీరియలే కాదు' అని కామెంట్‌​ చేశాడు. దీంతో అనుపమ ఎంతో వినయంగా సమాధానం ఇచ్చింది.  'మీరు చెప్తుంది కరెక్టే అన్నా.. నేను హీరోయిన్ టైప్ కాదు, నేను యాక్టర్ టైప్‌' అని చాచి చెంపపై కొట్టినట్లు బదులిస్తూనే స్మైలీ ఎమోజీలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు అనుపమకు మద్ధతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. బ్యూటీతో పాటు టాలెంట్‌ ఉన్న నటి అంటూ ఆమెను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉంటే అనుపమ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న  డిజే టిల్లూ స్క్వేర్‌తో పాటు..  రవితేజ రాబోయే భారీ యాక్షన్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది.

(ఇదీ చదవండి: అలాంటి వ్యక్తినే మనువాడతా: టాప్‌ హీరోయిన్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top