జెట్‌ స్పీడ్‌తో... | Anupama Parameswaran New Movie Updates | Sakshi
Sakshi News home page

జెట్‌ స్పీడ్‌తో...

Jul 1 2024 2:05 AM | Updated on Jul 1 2024 2:05 AM

Anupama Parameswaran New Movie Updates

తమిళంలో మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు హీరోయిన్  అనుపమా పరమేశ్వరన్ . ఇప్పటికే ఈ యంగ్‌ బ్యూటీ ప్రస్తుతం ‘బైసన్ ’,   ‘లాక్‌డౌన్ ’ అనే రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘లవ్‌టుడే’ ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథన్  హీరోగా అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘డ్రాగన్ ’లో ఓ హీరోయిన్ గా అనుపమ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కాలేజీలో ప్రదీప్‌–అనుపమల మధ్య చిత్రీకరిస్తున్న రొమాంటిక్‌ సన్నివేశాల విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. అనుపమ నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ, ది పెట్‌ డిటెక్టివ్‌’, పరదా’ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘ఆక్టోపస్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రాల్లో ఆమె నటిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇలా అరడజనుకుపైగా సినిమాలతో అనుపమా జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement