ఒక్క మెయిల్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌తో సినిమా ఛాన్స్‌ | Annapurna Studios Invite Casting Call | Sakshi
Sakshi News home page

ఒక్క మెయిల్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌తో సినిమా ఛాన్స్‌

Jun 22 2024 9:47 PM | Updated on Jun 23 2024 1:24 PM

Annapurna Studios Invite Casting Call

చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలని చాలామందికి కోరిక ఉంటుంది. టాలెంట్‌ ఉన్నా కూడా ఛాన్స్‌లు రావడంలేదని కొందరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలోని టాలెంట్‌ను గుర్తించి పలు నిర్మాణ సంస్థలు అవకాశాలు ఇస్తున్నాయి. మీలో ప్రతిభ ఉంటే చాలు అవకాశం ఇస్తామని చిత్ర యూనిట్‌ నుంచే అధికారికంగా ఈ మధ్య ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.

యాక్టింగ్‌ మీద కోరిక ఉండి ఒక్క ఛాన్స్ వస్తే చాలు తామేంటో నిరూపిస్తామనుకునే వారు ఎలాంటి స్టూడియోల చుట్టూ తిరిగే అవసరం లేదు. అలాంటి వారి కోసమే అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి ఒక ఆఫర్‌ వెలువడింది. తమ సంస్థ నుంచి రాబోతున్న కొత్త సినిమా కోసం ఆసక్తి ఉన్న నటీనటులు కావాలని ఒక ప్రకటనలో కోరింది.  

అందుకోసం 'actors@annapurnastudios.com' అకౌంట్‌కు మీ వివరాలతో పాటు ఒక నిమిషం నిడివి గల ఏదైనా సీన్‌కు సంబంధించి వీడియోను కూడా అందులో షేర్‌ చేయాలని కోరింది. 14 నుంచి 28 సంవత్సరాల వయసున్న యువతీయువకులు కావాలని వారు కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement