Annapoorani Trailer:బ్రాహ్మణ అమ్మాయి మంసాహార వంటకాలు రుచి చూస్తే..? | Nayanthara's 'Annapoorani - The Goddess Of Food' Trailer Out | Sakshi
Sakshi News home page

Annapoorani Trailer:బ్రాహ్మణ అమ్మాయి మంసాహార వంటకాలు రుచి చూస్తే..?

Nov 29 2023 7:33 AM | Updated on Nov 29 2023 10:16 AM

Annapoorani Trailer Out - Sakshi

నయనతార కెరీర్‌లో రూపొందిన 75వ సినిమా ‘అన్నపూరణి’. జై, సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. నీలేష్‌ కృష్ణ దర్శకత్వంలో జీ స్టూడియోస్, నాడ్‌ స్టూడియోస్, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది

‘‘నేను ఇండియాలోనే బెస్ట్‌ చెఫ్‌ అవుతాను.. అంకుల్‌’, ‘కలలో కోట కట్టకు.. వీధిలో క్రికెట్‌ ఆడే ప్రతి ఒక్కరూ సచిన్‌ టెండూల్కర్‌ కాలేడు, అలాగే ప్రతి బస్‌ కండక్టర్‌ సూపర్‌స్టార్‌ కాలేడు’, ‘ఇష్టపడి చేస్తే లక్షల్లో ఒకరు కాదమ్మా... లక్ష మందీ సూపర్‌ స్టార్‌ కావొచ్చు’ అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి.

ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అన్నపూర్ణ (నయనతార పాత్ర పేరు) చెఫ్‌ కావాలనుకుంటుంది. ఈ క్రమంలో మాంసాహార వంటకాలను రుచిగా చేయాల్సి ఉంటుంది. కానీ ఇందుకు ఆ యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. అప్పుడు ఆ యువతి ఏం చేసింది? జీవితంలో ఆమె లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అన్నది ఈ సినిమా కథనం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement