ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే? | Sakshi
Sakshi News home page

RRR Singer: లగ్జరీ కారు కొనుగోలు చేసిన ప్రముఖ సింగర్.. ధర ఎంతంటే?

Published Wed, Apr 10 2024 2:49 PM

Animal Singer Vishal Mishra Buys A Swanky Mercedes-Benz Maybach Car Worth - Sakshi

సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ యానిమల్‌. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన యానిమల్ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. 

అయితే ఈ చిత్రంలోని పెహేలే భీ మే, కబీర్ సింగ్‌ కైసే హువా అనే పాటలను ఆలపించారు ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా. తాజాగా అతను ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆధునాతన సౌకర్యాలున్న లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. సింగర్ విశాల్ గతంలో యోధా , సత్యప్రేమ్ కి కథ, చోర్ నికల్ కే భాగే, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నాటు నాటు సాంగ్‌ పాడారు.

ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన రాబోయే చిత్రం బడే మియాన్ చోటే మియాన్‌లో పాటలను ఆలపించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement