ఆ విషయంలో గొడవపడేవాళ్లం: యాంకర్‌ సుమ | Sakshi
Sakshi News home page

Anchor Suma Kanakala: 25వ పెళ్లి రోజు.. వారితో కలిసి సెలబ్రేషన్స్‌.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గొడవలు..

Published Thu, Feb 15 2024 4:07 PM

Anchor Suma, Rajeev Kanakala Celebrated Their 25th Wedding Anniversary in Old Age Home - Sakshi

ఒకరు సినీ సెలబ్రిటీ.. మరొకరు బుల్లితెర సెలబ్రిటీ.. వీరిద్దరి జోడీ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆ జంట మరెవరో కాదు రాజీవ్‌ కనకాల- యాంకర్‌ సుమ. ఈ మధ్యే వీరు 25వ పెళ్లి రోజు జరుపుకున్నారు. పాతికేళ్ల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సుమ తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ కొత్త వీడియో వదిలింది. ఇందులో ఎన్నో ప్రశ్నలకు ఈ దంపతులు సమాధానాలు చెప్పారు.

ఎప్పుడో చెక్‌ చేశా..
మీ పార్ట్‌నర్‌కు తెలియకుండా పార్ట్‌నర్‌ ఫోన్‌ చెక్‌ చేశారా? అని అడగ్గా రాజీవ్‌ లేదన్నాడు. కానీ సుమ మాత్రం చెక్‌ చేశానంది. ఏదో పదేళ్ల క్రితం చెక్‌ చేశాను అంటూ నవ్వేసింది. ఫోన్‌ చెక్‌ చేయడమేంటని షాకైన రాజీవ్‌ తాను కూడా తన జాగ్రత్తలో ఉన్నానని కౌంటరిచ్చాడు. ఏ విషయంలో గొడవపడేవారన్న ప్రశ్నకు.. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా రాజీవ్‌ దెయ్యాల సినిమాలకు తీసుకెళ్లేవాడని.. ఆ విషయంలో గొడవపడేవాళ్లమని సుమ సమాధానమిచ్చింది.

ఇన్నాళ్లకు సారీ చెప్పిన రాజీవ్‌
రాజీవ్‌కు ఫోన్‌ చేసినప్పుడల్లా ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానంటాడు.. కానీ ఎప్పుడూ చెప్పిన సమయానికి రాలేదని రాజీవ్‌పై కంప్లైంట్‌ ఇచ్చింది సుమ. పెళ్లైన ఆరేడేళ్ల వరకు అతడి గురించి ఎదురుచూసేదాన్నని.. తనకోసం ఎదురుచూసి చివరకు ఒక్కదాన్నే తినేసేదాన్నని చెప్పింది. దీంతో రాజీవ్‌.. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు పశ్చాతాప్పపడుతూ సారీ చెప్పాడు. ఈ మాటతో సుమ ఫుల్‌ ఖుషీ అయింది. కాగా సుమ తన పెళ్లిరోజును గుర్తు చేసుకుంటూ.. '25 ఏళ్ల క్రితం మేము పెళ్లి చేసుకుంటామంటే ఇంట్లో వ్యతిరేకత ఉన్నా తర్వాత అందరూ ఒప్పుకున్నారు.

నాలుగో ముడి కూడా..
ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నాం. మూడుముళ్లు రాజీవ్‌ వేశాక నాలుగో ముడి ఆడపడుచు వేయాల్సి ఉంది. కానీ రాజీవ్‌ ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. ఎంతో కష్టపడి ప్రేమించా.. ఆ ముడి కూడా నేనే వేస్తా అంటూ నాలుగోది కూడా అతడే వేశాడు. ఆ జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంది. అలాగే దగ్గర్లోని వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడే ఈ జంట యానివర్సరీ సెలబ్రేట్‌ చేసుకుంది. పెద్దల సమక్షంలో కేక్‌ కట్‌ చేసుకుని ఇరువురు దండలు మార్చుకున్నారు. వృద్ధులకు అన్నదానం చేశారు.

చదవండి: వాలంటైన్స్‌ డే.. ప్రియుడి తల పగలగొట్టిన హీరోయిన్‌

Advertisement
 
Advertisement