ఆర్మీలో రెండేళ్ల ట్రైనింగ్‌.. ఆ మాటలతో మధ్యలోనే ఆగిపోయా!: యాంకర్‌ రవి | Anchor Ravi Says He Discontinues Army Training | Sakshi
Sakshi News home page

Anchor Ravi: ఉదయం 4 గంటలకే ట్రైనింగ్‌.. అలా చేసుండకపోతే జీవితం మరోలా..!

Jun 2 2025 11:56 AM | Updated on Jun 2 2025 3:27 PM

Anchor Ravi Says He Discontinues Army Training

యాంకర్‌ రవి (Anchor Ravi).. బుల్లితెరపై ఎన్నో షోలు చేసే ఇతడు తాజాగా ఓ షోకి గెస్టుగా వెళ్లాడు. ఆహాలో తేజస్వి యాంకర్‌గా చేస్తున్న కాకమ్మ కథలు షోలో హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. యాంకర్‌ రవి మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల నాకు మంచి కుటుంబం దొరికింది. మా నానమ్మకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతం వచ్చు. అలా తను వేరేవాళ్లకు పాఠాలు చెప్పేది. అయితే ఈ కళపై ఆధారపడితే డబ్బు సంపాదించలేనని నాన్న అనేవాడు.

దేశభక్తి..
నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మిలిటరీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ కల్నల్‌ ఇల్లు చూపించాడు. ఆర్మీ ఆఫీసర్‌ అయితే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు తెలుసా.. అన్నాడు. నీకు గౌరవం, డబ్బు కావాలంటే ఆర్మీలో చేరాలన్నాడు. ప్రతి ఆదివారం అక్కడకు తీసుకెళ్లి.. మొదటి ప్రాధాన్యత దేశం.. తర్వాతే ఏదైనా అని నాకు దేశభక్తి నూరిపోశాడు. ఇంటర్‌ తర్వాత అందరూ ఇంజనీరింగ్‌ అని వెళ్తే నేను నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీకి వెళ్లాను. ఎగ్జామ్‌లో పాసై, ఇంటర్వ్యూ కూడా క్లియర్‌ చేసి అకాడమీలో చేరాను.

ఆర్మీ శిక్షణ మధ్యలో వదిలేశా..
పుణెలో ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఉదయం నాలుగు గంటలకు శిక్షణ మొదలయ్యేది. మూడు నెలలకోసారి సెలవులిచ్చేవారు. 11 రోజులపాటు ఇంటికెళ్లి మళ్లీ ట్రైనింగ్‌లో చేరేవాళ్లం. రెండేళ్ల తర్వాత ఓసారి ఇంటికి వచ్చినప్పుడు మా నానమ్మ నన్ను వదిలిపెట్టలేదు. ఆమె ప్రేమను చూశాక నేను తిరిగి వెళ్లనని చెప్పాను. జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆర్మీ శిక్షణను మధ్యలో వదిలేయడమే! నానమ్మ ప్రేమను కాదనుకుని వెళ్లిపోయుంటే లైఫ్‌ మరోలా ఉండేది. ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటాను అని రవి చెప్పుకొచ్చాడు.

చదవండి: హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్‌

Advertisement
 
Advertisement
Advertisement