
Anchor Rashmi Gautam Emotional On Bengalore Dog And Car Incident: బుల్లితెర యాంకర్‌గా సూపర్‌గా రాణిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది రష్మీ గౌతమ్. తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీకి మూగజీవాలపై ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఢిల్లీలోని జూ నిర్వాహకులపై మండిపడిన విషయం తెలిసిందే. రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న వీధి కుక్కకు చికిత్స చేయించింది. అనంతరం ఇంటికి తీసుకెళ్లి దానికి చుట్కీ అని పేరు పెట్టి మరీ పెంచుకుంటుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు రష్మీకి మూగజీవాలంటే ఎంత ప్రేమో. అలాగే వాటిని హింసించే వారిపై అంతే ఆగ్రహం చూపిస్తుంది. తాజాగా ఓ ఘటనపై మండిపడింది రష్మీ.
బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్లోని ఒక యువకుడు తన కారును నడుపుతూ పడుకున్న కుక్కపై నుంచి తీసుకెళ్లాడు. దీంతో ఆ కుక్క మరణించినట్లు సమాచారం. అయితే ఆ కారు నడిపిన యువకుడి ఫ్యామిలీకి వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నా పోలీసులు అరెస్టు చేశారట. ఈ ఘటనపై రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'డబ్బుతో వస్తువులు కొనొచ్చు గానీ బుద్దిని, పద్ధతిని కొనలేం. కఠినంగా శిక్షించారని తెలిసి సంతోషిస్తున్నాను. ఆ మూగజీవి పడ్డ బాధను ఆ కుటుంబమంతా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. కుక్కలను రాళ్లతో కొట్టడం పిల్లలకు నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఇలా తయారవుతారు.' అని భావోద్వేగానికి లోనైంది రష్మీ.