'ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్లుంది' అమితాబ్‌ ఆన్సరిదే! | Amitabh Bachchan Solid Reply to Trolls | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: 'బిగ్‌బీకి పిచ్చి పట్టింది'.. నువ్వు కూడా ఏదో ఒక రోజు..

Jun 23 2025 7:22 PM | Updated on Jun 23 2025 7:37 PM

Amitabh Bachchan Solid Reply to Trolls

సమాజంలో రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. సైబర్‌ క్రైమ్‌పై అవగాహన పెంచే కాలర్‌ ట్యూన్‌లను ఆ మధ్య తెగ ప్రసారం చేసింది. ఓటీపీలు షేర్‌ చేయొద్దు, లింక్స్‌ క్లిక్‌ చేయొద్దు.. సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త! అంటూ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)తోనూ చెప్పించింది. రోజుకు 8- 10 సార్లు ఈ కాలర్‌ ట్యూన్‌లు వినిపించేవి.

పిచ్చి పట్టినట్లుంది
దాని గురించి కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో నసుగుతూ కామెంట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన బిగ్‌బీ.. అయితే వెళ్లి ప్రభుత్వానికి చెప్పండి. నేను వారు చెప్పిందే చేశాను అని రిప్లై ఇచ్చారు. ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్లుంది అన్న కామెంట్‌కు.. ఏదో ఒక రోజు నువ్వు కూడా ముసలాడివి అవుతావు. వయసు పెరిగినవారికి కొండంత అనుభవం, జ్ఞానం ఉంటుందని అంటుంటారు, తెలీదా? అని కౌంటర్‌ ఇచ్చారు. కాగా అమితాబ్‌ బచ్చన్‌ గతేడాది కల్కి 2898 ఏడీ, వేట్టయాన్‌ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామాయణ: పార్ట్‌1 సహా మరో చిత్రంలో నటిస్తున్నారు.

చదవండి: థగ్‌ లైఫ్‌ డిజాస్టర్‌.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం

Advertisement
 
Advertisement
Advertisement