యాక్షన్‌ ఇరగ... | Amitabh Bachchan joins Deepika Padukone and Prabhas in next | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ఇరగ...

Nov 27 2020 11:53 PM | Updated on Nov 27 2020 11:53 PM

Amitabh Bachchan joins Deepika Padukone and Prabhas in next - Sakshi

‘మహానటి’ చిత్రం తర్వాత తన నెక్ట్స్‌ సినిమా ప్రకటించడానికి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ టైమ్‌ తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించారు. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో తెరకెక్కే ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకోన్‌ కథానాయికగా నటించనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. సుమారు 300 కోట్లపై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించనుంది.

ఈ సినిమాలో భారీ యాక్షన్‌ ఉంటుందని తెలిసింది. అయితే కేవలం ప్రభాస్‌ మాత్రమే కాదు దీపికా పదుకోన్, అమితాబ్‌ బచ్చన్‌ పాత్రలు కూడా కీలకమైన యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొంటాయన్నది తాజా టాక్‌. మామూలు ఫైట్స్‌ కాదు.. దీపికా, అమి తాబ్‌ ఇరగదీసే సూపర్‌ ఫైట్స్‌ చేస్తారని సమాచారం. ఈ యాక్షన్‌ సనివేశాల్లో పాల్గొనేందుకు ప్రభాస్, దీపికా శిక్షణ కూడా తీసుకోనున్నారని టాక్‌. అలానే అమితాబ్‌ బచ్చన్‌ది అతిథి పాత్ర కాదని, పూర్తి స్థాయి పాత్ర అని కూడా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement