రెండు గంటలు... ఏడు ప్రాజెక్ట్‌లు! | Amitabh Bachchan completes 7 projects in 2 hours: Bollywood | Sakshi
Sakshi News home page

రెండు గంటలు... ఏడు ప్రాజెక్ట్‌లు!

Jun 14 2025 5:05 AM | Updated on Jun 14 2025 5:05 AM

Amitabh Bachchan completes 7 projects in 2 hours: Bollywood

ఎనిమిది పదుల వయసులో ఎంతో చురుకుగా సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్‌ బచ్చన్‌. వేగంగా పని చేయడం తనకు ఇష్టం అంటున్నారు ఈ బిగ్‌ బి. అందుకు ఉదాహరణగా ఇటీవల తాను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్‌లు (ఐదు వాణిజ్య ప్రకటనలు, రెండు ఫొటోషూట్‌లు) చేసిన విషయం గురించి చెప్పారు. ‘‘ఈ మధ్య నేను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్‌లు చేయడంతో నా డైరెక్టర్‌ ఫ్రెండ్‌ ఒకరు ‘ఇలా పని చేయడం సరి కాదు.

ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన పనిని నువ్వు రెండు గంటల్లో పూర్తి చేస్తే ఎలా? నువ్వు పని వి«ధానాన్నిపాడు చేస్తున్నావు. ఇలా చేస్తే క్లైంట్‌లు ఒకే రోజులో ఎక్కువ ప్రాజెక్ట్‌లు చేయమంటారు. అది కరెక్ట్‌ కాదు’ అని చమత్కారంగా అన్నాడు. ఆ మాటలు నాకు చాలా ఆనందాన్నిచ్చాయి. నాకు ఇలా స్పీడ్‌గా పని చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు అమితాబ్‌ బచ్చన్‌.

Advertisement
 
Advertisement
Advertisement