మరోసారి పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరో కూతురు.. ఎందుకంటే? | Amir Khan Daughter Ira Khan are set to have a traditional wedding ceremony | Sakshi
Sakshi News home page

Amir Khan Daughter: అమిర్ ఖాన్ కూతురు పెళ్లి.. వరుడి కోసం అలా!

Jan 7 2024 11:41 AM | Updated on Jan 7 2024 11:53 AM

Amir Khan Daughter Ira Khan are set to have a traditional wedding ceremony - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఇటీవలే తన ప్రియుడిని పెళ్లాడింది. ముంబైలో జరిగిన ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నవంబర్‌ 3న జరిగిన పెళ్లిలో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్ శిఖరేతో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర  సంప్రదాయంలో వీరి వివాహా వేడుక జరగనుంది.

వరుడి కుటుంబం కోరిక మేరకే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహా వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈనెల 8 నుంచి మూడు రోజుల పాటు సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఇప్పటికే నూతన వధువరులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అమీర్ ఖాన్ సైతం పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్నారు. మెహందీ, హల్దీ వేడుకలకు ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, బంధువులు హాజరు కానున్నారు. 

పెళ్లి ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం జనవరి 13న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో బాలీవుడమ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో సహా పలువురు అగ్రతారలు హాజరు కానున్నారు. 

కాగా.. జనవరి 3నముంబైలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అదే రోజు గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు. అమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల సంతానమే ఐరా ఖాన్‌. ఆమిర్‌- రీనా దంపతులకు జునైద్‌ ఖాన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమిర్‌.. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా 2022లో విడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement