Amid Divorce Buzz, Abhishek Bachchan's Tweet About Aishwarya Goes Viral - Sakshi
Sakshi News home page

Aishwarya Rai-Abhishek: ఐశ్వర్యరాయ్‌-అభిషేక్‌ బచ్చన్ విడిపోతున్నారా? బీటౌన్‌లో హాట్‌టాపిక్‌

Apr 7 2023 8:20 PM | Updated on Apr 7 2023 8:50 PM

Amid Divorce Buzz Abhishek Bachchan Tweet About Aishwarya Goes Viral - Sakshi

విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌-అభిషేక్‌ బచ్చన్‌ల వైవాహిక జీవితం గురించి కొద్దిరోజులుగా తరచూ రూమర్స్‌ వినిపిస్తున్నాయి. వీరిమధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రస్తుతం బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్‌కు ఐష్‌ అభిషేక్‌ లేకుండా కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లడంతో వీరి విడాకుల అంశం మరోసారి చర్చకు వచ్చింది.

కొంతకాలంగా సినిమా ఫంక్షన్లు, పార్టీలు, ఈవెంట్లకు ఐశ్వర్య ఒక్కతే హాజరవుతుంది. లేదా కూతుర్ని వెంటేసుకొని వెళ్తుంది. దీంతో ఐష్‌-అభిషేక్‌ల మధ్య పొసగడం లేదని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ అనుమానాలను అభిషేక్‌ ఖండించారు.

ఓ ఈవెంట్‌లో ఆరాధ్యతో కలిసి ఉన్న ఐశ్వర్యరాయ్‌ ఫోటోను షేర్‌ చేస్తూ.. ఓ నెటిజన్‌ మై ఫేవరెట్‌ పీపుల్‌(My Fav People)అని పేర్కొనగా..దీనికి అభిషేక్‌ స్పందిస్తూ.. నాకు కూడా ఫేవరెట్‌(Mine Too) అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో ఐశ్వర్య-అభిషేక్‌ విడిపోనున్నారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా 2007లో ప్రేమ వివాహం చేసుకున్న ఐష్‌-అభిషేక్‌లకు కూతురు ఆరాధ్య సంతానం. 

Advertisement
 
Advertisement
Advertisement