అమర్‌ దీప్‌-సుప్రిత సినిమా: ఆడియన్స్‌తోనే టైటిల్‌ రివీల్‌ | Amardeep, Supritha New Film Latest Update | Sakshi
Sakshi News home page

అమర్‌ దీప్‌-సుప్రిత సినిమా: ఆడియన్స్‌కే టైటిల్‌ పెట్టే చాన్స్‌

Dec 12 2024 1:27 PM | Updated on Dec 12 2024 2:33 PM

Amardeep, Supritha New Film Latest Update

ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు సినిమాల ప్రమోషన్స్‌ వినూత్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల మేకర్స్‌.. తమ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసి.. సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసుకుంటున్నారు. తాజాగా ఓ  సినిమా మేక‍ర్స్‌ కూడా ప్రమోషన్స్‌ని డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు. సినిమాకి టైటిల్‌ పెట్టే చాన్స్‌ ఆడియన్స్‌కే ఇచ్చేశారు. అదే బిగ్‌బాస్‌ ఫేం అమర్‌దీప్‌ కొత్త సినిమా. 

మాల్యాద్రి రెడ్డి  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్‌గా నటిస్తోంది.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.  అయితే షూటింగ్‌ పూర్తి కాకముందే ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు.

‘సినిమా మాది - టైటిల్ మీది’ అని ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేస్తూ, తమ సినిమా సూట్ అయ్యే టైటిల్ ను ఆడియన్స్ నిర్ణయించాలని కోరారు. అనుకున్న టైటిల్ ని+91 8985713959 నంబర్‌కి వాట్సాప్ ద్వారా పంపించాలని ప్రేక్షకులను ఆహ్వానించారు. సెలెక్ట్ అయిన టైటిల్ ని సినిమా టీం స్వయంగా ప్రేక్షకుల ఇంటి వద్దకి వచ్చి వారితోనే టైటిల్ రివీల్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement