Allu Arjun Visited His Cousin Sai Dharam Tej at Apollo Hospital in Hyderabad - Sakshi
Sakshi News home page

Allu Arjun: సాయి ధరమ్‌ తేజ్‌ను పరామర్శించిన బన్నీ

Sep 16 2021 5:51 PM | Updated on Sep 16 2021 7:38 PM

Allu Arjun Visits Apollo Hospitals To See Sai Dharam Tej - Sakshi

Allu Arjun Visits His Cousin Sai Dharam Tej In Apollo Hospital​:మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డా. అలోక్‌ రంజన్‌ నేతృత్వంలోని వైద్య బృందం ఎప్పటికప్పుడు తేజ్‌ ఆరోగ్య పరిస్థితిని క్లోజ్‌గా మానీటరింగ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా గురువారం అల్లు అర్జున్‌ అపోలో ఆసుపత్రికి చేరుకొని సాయ్‌తేజ్‌ను పరామర్శించారు. తేజ్‌  ఆరోగ్య పరిస్థితి గురించి  వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదం అనంతరం చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ సహా మెగా కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు అపోలో ఆసుపత్రికి వచ్చి తేజ్‌ను పరామర్శించారు. అయితే ఆ సమయంలో బన్నీ 'పుష్ప' షూటింగ్‌ నిమిత్తం కాకినాడ వెళ్లడంతో అప్పుడు రాలేకపోయారు. గురువారం షూటింగ్‌ అనంతరం హైదరాబాద్‌ వచ్చిన బన్నీ నేరుగా సాయి ధరమ్‌ తేజ్‌ను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి : 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు'
అనారోగ్య సమస్యలతో బిగ్‌బాస్‌-4 విజేత అభిజిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement