అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌ | Allu Arjun Gave A Big Surprise To Fans - Sakshi
Sakshi News home page

Allu Arjun : అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌.. ఈ రకంగా పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌

Aug 30 2023 11:10 AM | Updated on Aug 30 2023 12:02 PM

Allu Arjun Surprise To Fans - Sakshi

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాకుండా టాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా గుర్తింపు పొందాడు. అలా తన అభిమానులను గర్వించేలా చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. అయితే, పుష్ప 2 ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇదిలా ఉంటే ఆయన తాజాగా ఓ వీడియోతో అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి)

అభిమానుల కోసం సర్‌ప్రైజ్ ఇస్తున్నామని ముందే చెప్పి అనుకున్నట్లుగానే అంతకు మించిన  స్పెషల్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్‌ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. అల్లు అర్జున్‌ రోజువారి దినచర్య ఎలా ఉంటుందో వాయిస్‌ రూపంలో చెబుతూ ఒక వీడియోను రూపొందించారు. బన్నీకి ఇన్‌స్టాగ్రామ్‌లో  22 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆయనకు జాతీయ అవార్డు రావడంతో ఇప్పటికే ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్‌..

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా.. టాలీవుడ్‌లో టాప్‌ బన్నీనే)

పార్టీ లేదా పుష్ప..? అనేవారికి ఈ వీడియోతో ఫిదా చేశాడు బన్నీ. అది కూడా అభిమానులకు  కిక్కిచ్చేలా ఉంది. అంతలా దీనిని డిజైన్‌ చేశారు.  ఇక ఈ వీడియో విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్‌ ముందుగా తన ఇంటిని చూపిస్తూ.. ఉదయం నిద్రలేచిన తర్వాత నుంచి దినచర్య అంతా చెప్పుకొచ్చారు. ఆపై పుష్ప 2 సెట్‌లో ఏం జరుగుతుందో సుకుమార్‌తో పంచుకున్నాడు. చాలా స్పెషల్‌గా ఉన్న ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. వచ్చే ఏడాది మార్చి 22న సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement