
టాలీవుడ్‌లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. చిరు మినహా మిగిలిన అందరికీ వారసత్వంగా ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందిని ఉత్సుకతను రేకెత్తించింది.
ఇప్పటివరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మెగా అభిమాన సంఘాల ద్వారానే పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ, మెగా ప్యాన్స్ పలుమార్లు ఇప్పటికీ కూడా బన్నీ సినిమాలతో పాటు ఆయన్ను కూడా ట్రోల్స్ చేయడం జరుగుతూనే ఉంది. దీంతో బన్నీ అభిమానులు కూడా తమ శక్తికి మించి వారికి కౌంటర్స్ ఇస్తున్నారు. ఇప్పడు తమకంటూ ఒక ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండాలని వారు భావించినట్లు ఉన్నారు. అందుకే "Allu Arjun Fans Association" పేరుతో ఒక సంఘం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా కమిటీ సభ్యులను ఎన్నుకుంది.
సంధ్య థియేటర్ ఘటనతో మార్పు
అల్లు అర్జున్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఉన్న యూత్‌లో ఎక్కువ మంది ఆయన్ను అభిమానించే వారే ఉన్నారని చెప్పవచ్చు. కానీ, పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఈ కేసులో అరెస్టు అయినప్పుడు అల్లు అర్జున్ సరైన అభిమానుల సంఘం అవసరాన్ని గ్రహించాడని కొందరు చెబుతారు. పెద్ద సంఖ్యలో వ్యవస్థీకృత అనుచరులతో కూడిన ఒక టీమ్ తనకు అవసరమని ఆయన గుర్తించినట్లు ఇండస్ట్రీలోని తన సన్నిహితులు చెబుతున్నారు.

ఆ సమయంలో బన్నీకి అధికారికంగా అభిమానుల సంఘం లేదు. దీంతో అతని తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్ చేసేవారు లేరు. ఈ సంఘటనను ఛాన్స్‌గా తీసుకున్న కొందరు అతనిపై సోషల్‌మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. దీంతో ట్రోల్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. అదే టైమ్‌లో తనకు కూడా ఒక బలమైన సంఘం ఉండుంటే ఇలా జరిగేది కాదని చెబుతారు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా అల్లు అర్జున్ కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ప్లాన్ ఉన్నట్లు సమాచారం. తనను అభిమానించే వారి కుటుంబాలకు తనవంతుగా సాయం చేసేందుకు ముందు వరుసలో ఉండాలనే ప్లాన్‌తో ఆయన ఉన్నారట.
ఎన్టీఆర్ కోసం యుద్ధమే చేసిన అభిమాన సంఘాలు
సినిమా హీరోలకు ఏదైనా సమస్య వస్తే మొదటి బలంగా గొంతు ఎత్తేది అభిమాన సంఘాలే... రీసెంట్‌గా ఎన్టీఆర్- అనంతపురం అర్బన్ ఎమ్మేల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదం గురించి చెప్పవచ్చు. తారక్ గురించి అతను చేసిన వ్యాఖ్యలకు ఆయన అభిమానులు విరుచుకుపడ్డారు. ఇప్పటికీ కూడా ఆ ఎమ్మేల్యే స్వేచ్ఛగా తిరగలేకుండా ఉన్నారు. అలా కొన్ని సందర్భాల్లో తమ హీరో కోసం వారు అండగా నిలబడుతారు.
We are delighted to officially launch and announce the Allu Arjun Fans Association!
Presenting the list of elected committee members of both AP & TS States who will serve for the upcoming term.
Hearty congratulations and best wishes to all the members – may your journey ahead… pic.twitter.com/Ca2cJjg0Pr— Allu Arjun Fans Association (@AAFAOnline) October 12, 2025