Akkineni Nagarjuna: ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది.. అందుకే ఈ నిర్ణయం: నాగార్జున

Akkineni Nagarjuna Decided to take Take Rest Six Months From Movies - Sakshi

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోలకు ఏ మాత్రం తగ్గని నటుడు అక్కినేని నాగార్జున. వయసు పెరుగుతున్నా తనకున్న గ్లామర్‌ రోల్‌తో అభిమానులకు దగ్గరవుతుంటారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'ది ఘోస్ట్'. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5న థియేటర్లలో అలరించనుంది. ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాలను ఒప్పుకోలేదని ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రంలోనూ కీలక పాత్ర పోషించిన నాగార్జున.. సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

(చదవండి: మా జీవితాల నుంచి వెళ్లిపోయింది.. చై-సామ్‌ విడాకులపై నాగార్జున కామెంట్స్‌)

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ 'కొవిడ్‌ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చినట్లు గ్రహించా. ప్రజలు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. అందుకోసం కనీసం ఆరు నెలల సమయం అవసరం. ఈ  ఏడాది 'ది ఘోస్ట్‌' తర్వాత నా సినిమాలేవీ ఉండట్లేదు.  తర్వాత ఓటీటీలోనూ నటించాలనే ప్రణాళికతో ఉన్నా. అందుకే స్క్రిప్ట్ విన్నాక అది  ఓటీటీకి సరిపోతుందా.. థియేటర్‌లో రిలీజ్‌ చేయాలా.. అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాలి. అందుకే విరామం తీసుకోవాలనుకుంటున్నా' అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top