
బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ కిడ్స్‌ను వెండితెరకు పరిచయం చేసిన దర్శక నిర్మాత ఎవరని అడిగితే ఠక్కున గుర్తుచ్చే పేరు కరణ్ జోహార్. ఇప్పటికే కరణ్ ఎంతోమంది స్టార్ వారసులను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేశాడు. బీటౌన్ స్టార్స్ కూడా తమ వారసులను కరణ్ చేతిలో పెట్టాలని ఆశ పడుతుంటారు. ఇదిలా ఉండగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాపై కరణ్ ఈమధ్య ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.
ఇప్పటికే లైగర్ సినిమా ద్వారా విజయ్ దేవరకొండను బాలీవుడ్‌కు పరిచయం చేసిన కరణ్ ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోను కూడా బీటౌన్‌కు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఆయన మరెవరో కాదు. కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని . ఇప్పటికే దీనికి సంబంధించి నాగ్ కరణ్‌తో చర్చలు జరుపుతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. త్వరలోనే కరణ్ అఖిల్‌ని హిందీలో లాంచ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.