Akansha Ranjan Kapoor Finds Her Darling in Director Sharan Sharma - Sakshi
Sakshi News home page

Akansha Ranjan Kapoor: దర్శకుడితో హీరోయిన్ ప్రేమాయణం.. పిక్స్ వైరల్..!

Feb 10 2023 3:43 PM | Updated on Feb 10 2023 4:20 PM

Akansha Ranjan Kapoor finds her darling in director Sharan Sharma - Sakshi

బాలీవుడ్ నటి ఆకాంక్ష రంజన్ కపూర్ గిల్టీ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. అంతకుముందే పలు టీవీ సీరీస్‌ల్లోనూ కనిపించింది భామ. 2019లో టెలివిజన్ ఫ్యాషన్ సిరీస్, తేరే దో నైనా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లోనూ కనిపించింది. తాజాగా ఈ నటికి సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శకుడు శరణ్ శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ మై డార్లింగ్ సినిమాలో చివరిసారిగా కనిపించిన నటి గుంజన్ సక్సేనా దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

 

వీరిద్దరూ ఆరు నెలలకు పైగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. శరణ్ శర్మ తన ఇన్‌స్టాలో చేసిన రంజన్‌ కపూర్‌తో ఉన్న ఫోటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు లవ్‌ సింబల్‌ ఎమోజీలతో కామెంట్స్ చేశారు. గతేడాది ద్వితీయార్థంలో వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించినప్పటికీ ఎక్కడ గానీ ఈ  విషయాన్ని బయటపెట్టలేదు ఈ జంట. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే వేడుకల్లోనూ రంజన్ కపూర్, శరణ్ శర్మ తరచుగా హాజరవుతుంటారు.

ఈ విషయంపై సన్నిహితుడొకరు మాట్లాడుతూ..'వారు కచ్చితంగా డేటింగ్ చేస్తున్నారు. వారు తమ సంబంధాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని నేను అనుకోను. వాస్తవానికి ఈవిషయంలో వారు చాలా ఓపెన్‌గా ఉంటారు. అని అన్నారు. కాగా.. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో రంజన్‌ కపూర్‌ను ప్రశ్నించగా నో కామెంట్స్ అంటూ బదులిచ్చారు. కాగా.. ది గుంజన్ సక్సేనా: కార్గిల్ గర్ల్ దర్శకుడు శరణ్ శర్మ ప్రస్తుతం మిస్టర్ & మిసెస్ మహీ చిత్రీకరణలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement