Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు.. | Ajith Trips to Himalayas by Bike | Sakshi
Sakshi News home page

Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు..

Aug 31 2022 10:04 AM | Updated on Aug 31 2022 1:38 PM

Ajith Trips to Himalayas by Bike - Sakshi

టూర్‌ వెళ్తున్న అజిత్‌ 

అజిత్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆయన బైక్‌లో సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తుంటారు. అలా తాజాగా ఈసారి ఏకంగా హిమాలయాలకు వెళ్లారు. ప్రస్తుతం తన 61వ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇటీవల ఫ్యామిలీతో ఐరోపా దేశాలు చుట్టి వచ్చిన అజిత్‌ చెన్నైకి తిరిగి రాగానే తాను నటిస్తున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా విశాఖపట్నంలో జరిగిన చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి, అటునుంచి అటే తన మిత్ర బృందంతో బైకులో లడక్‌ వెళ్లి అటు నుంచి హిమాలయాలకు చేరుకున్నారు.

ఆయనతో పాటు పొల్లాచి నగరం 8వ వార్డు అన్నాడీఎంకే కౌన్సిలర్‌ సెంథిల్‌ కూడా పాల్గొనటం విశేషం. ఆయనకు అజిత్‌ మాదిరిగానే బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. దీంతో ఆయన అజిత్‌కు బాగా దగ్గర అయిపోయారు. హిమాలయాల్లో వారం పాటు బైక్‌ డ్రైవింగ్‌ చేసి ఆ తర్వాత చెన్నైకి చేరుకుంటారు. అనంతరం నటిస్తున్న చిత్ర డబ్బింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం.

చదవండి: (మాజీ ప్రియుడిని అరెస్ట్‌ చేయించిన అమలాపాల్‌)

Advertisement
 
Advertisement
Advertisement