Ajith Kumar Thunivu First Song Chilla Chilla Is Out Now - Sakshi
Sakshi News home page

Ajith Kumar: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న అజిత్‌ 'చిల్లా చిల్లా' సాంగ్‌

Dec 11 2022 8:49 AM | Updated on Dec 11 2022 11:35 AM

Ajith Kumar Thunivu First Song Chilla Chilla Is Out Now - Sakshi

తమిళసినిమా: రజనీకాంత్, అజిత్, విజయ్‌ వంటి స్టార్‌హీరోల చిత్రాల్లో ప్రేక్షకులకు ఎంతో కొంత ఏదో ఒక సందేశం ఉంటుంది. అయితే ఈ తరం ప్రేక్షకులకు సందేశాలు, సూచనలు నచ్చడం లేదు. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా, సరదాగా సాగే చిత్రాలనే ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు హెచ్‌.వినోద్‌ గ్రహింనట్లున్నారు. అల్టీమేట్‌ స్టార్‌ అజిత్‌కు ఈయన ఇంతకుముందు నేర్కొండ పారై్వ, వలిమై చిత్రాలను చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఓకే అనిపించుకున్నా, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ అంశాల లోపం కనిపిస్తుంది.

కాగా తాజాగా ముచ్చటగా మూడోసారి అజిత్‌ కథానాయకుడిగా తుణివు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విధితమే. మలయాళ నటి మంజువారియర్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీ సినిమా సంస్థతో కలిసి బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందింది. పొంగల్‌ సందర్భంగా విడుదలకీ సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇది సంగీత దర్శకుడు జిబ్రాన్‌కు 50వ చిత్రం అన్నది గమనార్హం.

ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు అనిరుధ్‌ పాడిన సల్లా సల్లా అనే పాటను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండీగా మారింది. తుణివు చిత్రం గురిం దర్శకుడు హెచ్‌.వినోద్‌ తాజాగా చెప్పిన విషయం ఇందులో ఎలాంటి సందేశాలు ఉండవన్నారు. ఓన్లీ మాస్‌ అంశాలతో కూడిన ఎంటర్‌టెయిన్‌మెంట్‌ కథా చిత్రంగా తుణివు ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement