సూపర్‌స్టార్‌ కాళ్లకు మొక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. వీడియో వైరల్! | Aishwarya Rai Daughter Aradhya Fall On Kannada Star Shiva Rajkumar feet | Sakshi
Sakshi News home page

Aishwarya Rai Daughter: సూపర్‌స్టార్‌ కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య కూతురు..!

Sep 19 2024 9:10 AM | Updated on Sep 19 2024 10:22 AM

Aishwarya Rai Daughter Aradhya Fall On Kannada Star Shiva Rajkumar feet

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో మెరిసింది. గతేడాది పొన్నియిన్ సెల్వన్‌తో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో నటనకు గానూ ఐశ్వర్య లీడ్‌ రోల్‌ ఉత్తమనటిగా(క్రిటిక్స్‌) సైమా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌తో కలిసి వేదికపై అవార్డును అందుకుంది.

ఈ వేడుకకు హాజరైన ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన తల్లిని చూసి పరుగెత్తుకుంటూ స్టేజీ వద్దకు వచ్చింది. తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని అభినందించింది. అదే సమయంలో అక్కడే ఉన్న కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్ కుమార్‌ కాళ్లకు ఆరాధ్య నమస్కరించింది. ఆయన పాదాలకు మొక్కిన ఆరాధ్య ఆశీస్సులు తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో ఐశ్వర్యరాయ్ నటించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రంలో తన నటనకు గానూ ఫీమేల్ లీడ్ రోల్ (క్రిటిక్స్) విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. కాగా.. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాలను మణిరత్నం తెరకెక్కించారు. 

Advertisement
 
Advertisement
Advertisement