Hrithik Roshan Second Marriage: ఫర్హాన్‌ బాటలో హృతిక్‌.. ప్రేయసితో రెండో పెళ్లికి సిద్ధం?

After Farhan Akhtar Hrithik Roshan Plans To Marry Rumoured Girlfriend Saba Azad - Sakshi

బాలీవుడ్‌ స్టైలిష్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటి సబా అజాద్‌తో ప్రేమలో మునిగితేలుతున్నాడంటూ బీ-టౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే హృతిక్‌ ఈ మధ్య సబా ఆజాద్‌తో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ మీడియా కెమెరా కంట పడుతున్నాడు. దీంతో ఈ పుకార్లు నిజమేనేమోనంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు హృతికి ఈ వార్తలను ఖండించలేదు. పైగా ఇటీవల సబాను ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా సబా హృతిక్‌ ఫ్యామిలీతో కలిసి లంచ్‌ చేసి, సరదాగా వారితో సమయాన్ని గడిపింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

చదవండి: భీమ్లా నాయక్‌ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌పై కేటీఆర్‌ ట్వీట్‌

దీంతో హృతిక్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌ మారింది. త్వరలోనే హృతిక్‌, సబా పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా ఇటీవల ఫర్హాన్‌ అక్తర్‌ తన ప్రేయసి శిబానీ దండేక‌ర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిమంది సన్నిహితులు, బంధువుల, కుటుంబ సభ్యుల మధ్య ఫర్హాన్‌-శిబానీల వివాహం ప్రైవేట్‌గా జరిగింది. ఈ వేడుకకు హృతిక్‌ కూడా హజరయ్యాడు. దీంతో ఫర్హాన్‌ తరహాలోనే తాను కూడా కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నాడట. జీవితంలో ఒక తోడు అవసరమని భావించిన హృతిక్‌ తొందర్లోనే ప్రేయసి సబాను.. శ్రీమతిగా చేసుకోవాలని ఫిక్స్‌ అయ్యాడని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

చదవండి: మూడో భార్య రమ్య మోసాలు.. వీడియో రిలీజ్‌ చేసిన నటుడు నరేష్‌

మరి ఇందులో ఎంత నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా హృతిక్‌ తరచూ సబాతో కలిసి డిన్నర్‌, లంచ్‌ డేట్‌లకు వెళ్లడం, కెమెరాలకు కనబడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం చూస్తుంటే వీరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనేది నిజమేనని, త్వరలోనే ఈ వార్తలు నిజకానున్నాయేమో అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే హృతిక్‌ మాజీ భార్య సుశానే ఖాన్ కూడా నటుడు అర్స్లాన్ గోనితో రిలేషన్‌లో ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  కాగా హృతిక్‌, సుశానే ఖాన్‌లు 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత 2014లో ఈ దంపతులు విడిపోయారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top