Viral: KTR Tweet On Bheemla Nayak Movie Pre Release Event, Conveyed His Best Wishes - Sakshi
Sakshi News home page

KTR-Bheemla Nayak Movie: భీమ్లా నాయక్‌ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌పై కేటీఆర్‌ ట్వీట్‌

Feb 24 2022 2:53 PM | Updated on Feb 24 2022 4:02 PM

KTR Tweet On Bheemla Nayak Movie Pre Release Event - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్‌ చిత్రం భీమ్లా నాయక్‌ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ బుధవారం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే భీమ్లా నాయక్‌ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు మంత్రి కేటీఆర్‌ హజరు కావడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హజరుకావడంపై నేడు(గురువారం) ఉదయం కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి: 2 ఎకరాల్లో బన్నీ కొత్త ఇల్లు.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా!

ఈ సందర్భంగా ఆయన  ‘భీమ్లా నాయక్‌ మూవీ విడుదల సందర్భంగా మై బ్రదర్స్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి, తమన్‌, సాగర్‌ కే చంద్రలకు శుభాకాంక్షలు తెలిపేందుకు నా రోటిన్‌ లైఫ్‌ నుంచి కాస్తా విరామం తీసుకున్నాను’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ‘పద్మశ్రీ మొగిలయ్యగారు, శివమణి వంటి అద్భుతమైన సంగీత విద్వాంసులను ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని మంత్రి కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement