జర్నలిస్ట్‌గా అలరించబోతున్న అదితి శంకర్‌ | Aditi Shankar Plays Journalist In Sivakarthikeyan Maaveeran Movie | Sakshi
Sakshi News home page

Aditi Shankar: జర్నలిస్ట్‌గా అలరించబోతున్న అదితి శంకర్‌

Sep 7 2022 9:51 AM | Updated on Sep 7 2022 9:53 AM

Aditi Shankar Plays Journalist In Sivakarthikeyan Maaveeran Movie - Sakshi

ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉన్న నటి ఆదితి శంకర్‌. ప్రముఖ దర్శకుడు శంకర్‌ వారసురాలు. ఎప్పుడైతే గట్టిగా సినీ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి ఈమె గురించి తెగ వార్తలు ప్రచారం అయ్యాయి. ఈమె తొలిసారిగా కార్తీతో విరువన్‌ చిత్రంతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందులో గ్రామీణ యువతిగా దుమ్మురేపిన ఆదితి శంకర్‌ నటనకు ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాకుండా ఆ చిత్ర విడుదలకు ముందే మరో చిత్రం ఈ బ్యటీని వరించింది. శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న ‘మా వీరన్‌’ చిత్రం. డాక్టర్, డాన్‌ చిత్రాల తరువాత శివకార్తికేయన్‌ నటిస్తున్న తాజా చిత్రం ఇది.

చదవండి: ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్‌ సెల్వన్‌’ ట్రైలర్‌

మండేలా చిత్రం ఫేమ్‌ మండేన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో దర్శకుడు మిష్కిన్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే తొలి షెడ్యల్‌ పూర్తి చేసుకుంది. తాజాగా చెన్నై పరిసర ప్రాంతాలలో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. కారణం ఈయన తొలి చిత్రం మండేలా పలు అవార్డులను గెలుచుకోవడమే. కాగా ఈ చిత్రంలో నటి ఆదితి శంకర్‌ ఒక పత్రిక కార్యాలయంలో పని చేసే పాత్రికేయురాలి పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రంలో గ్రామీణ యువతిగా నటింన తాను రెండవ చిత్రంలోనే దానికి పూర్తి కాంట్రాస్ట్‌ పాత్రలో నటించడం సంతోషంగా ఉందని ఆదితి శంకర్‌ పేర్కొన్నారు. గ్లామరస్‌ పాత్రలో నటించడానికి వెనుకాడనని ముందే స్పష్టం చేసింది ఈ అమ్మడు.  

చదవండి: పుష్ప 2పై అప్‌డేట్‌ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్‌లో అడుగుపెడతా’

Advertisement
 
Advertisement
Advertisement