Rashmika Mandanna Comments At Goodbye Movie Trailer Event - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: పుష్ప 2పై అప్‌డేట్‌ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్‌లో అడుగుపెడతా’

Sep 7 2022 8:52 AM | Updated on Sep 7 2022 9:48 AM

Rashmika Mandanna Comments At Goodbye Movie Trailer Event - Sakshi

‘‘ఫలానా స్క్రిప్ట్‌ను ఎంచుకుంటే అది జరుగుతుందేమో! ఫలానా స్క్రిప్ట్‌ను ఎంచుకోకపోతే మరొకటి జరుగుతుందేమో అని హైరానా పడను. జరిగేదే జరుగుతుందనుకుని నా గట్‌ ఫీలింగ్‌తో స్క్రిప్ట్స్‌ ఎంచుకుంటాను’’ అన్నారు రష్మికా మందన్నా. అమితాబ్‌ బచ్చన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటింన హిందీ చిత్రం ‘గుడ్‌ బై’. వికాశ్‌ బాల్‌ దర్శకత్వంలో రపొందిన ఈ సినివ అక్టోబరు 7న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. హిందీలో రష్మికా మందన్నాకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రష్మికా మందన్నాను ‘మీరు ఏ విషయానికి గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నారు’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘‘నెగిటివిటీకి గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నాను.

చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్‌ అయ్యింది: సంగీత షాకింగ్‌ కామెంట్స్‌

నేను చాలా పాజిటివ్‌ పర్సన్‌ని. మనందరం నెగిటివిటీకి గుడ్‌ బై చెప్పాలని, ప్రపంచం అంతా పాజిటివ్‌నెస్‌తో నిండిపోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకువర్‌  దర్శకత్వంలో రపొందిన ‘పుష్ప: ది రైజ్‌’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినివ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా నెక్ట్స్‌ పార్ట్‌ ‘పుష్ప: ది రైజ్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా రెండో భాగం చిత్రీకరణ ఆరంభం కాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో మరో రెండు రోజుల్లో జాయిన్‌ అవుతున్నట్లుగా రష్మిక అప్‌డేట్‌ ఇచ్చారు.

చదవండి: చై-సామ్‌ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్‌

Advertisement
 
Advertisement
Advertisement