Samantha Father Emotional Post: చై-సామ్‌ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్‌ పోస్ట్‌

Samantha Father Joseph Prabhu Shares Emotional Note On ChaySam Divorce - Sakshi

టాలీవుడ్‌ మాజీ కపుల్‌ సమంత, నాగ చైతన్య విడిపోయి ఏడాది కావోస్తోంది. గతేడాది అక్టోబర్‌ 2న ఈ జంట విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చింది. అప్పటి నుంచి వీరి విడాకుల వార్తలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవడాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ వీరద్దరు మళ్లీ కలిస్తే బాగుంటుందని ఆశించే వారు ఎంతోమంది ఉన్నారు.

చదవండి: లలిత్‌ మోదీకి కూడా సుస్మితా బ్రేకప్‌ చెప్పిందా? అసలేం జరిగింది!

అయితే వీరి విడాకులు వార్తలపై ఇంతకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇటూ అక్కినేని ఫ్యామిలీ కానీ, అటూ సమంత కుటుంబ సభ్యులు కానీ దీనిపై పెద్ద స్పందించలేదు. ఈ క్రమంలో చై-సామ్‌ విడిపోయి ఏడాది దగ్గరపడుతున్న క్రమంలో సమంత తండ్రి జోసెఫ్‌ ప్రభు ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు. దీంతో మరోసారి చై-సామ్‌ విడాకుల అంశం వార్తల్లో నిలిచింది. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన ఫేస్‌బుక్‌ ఒక పోస్ట్ షేర్‌ చేశాడు. అయిదేళ్ల క్రితం షేర్‌ చేసిన సమంత-నాగ చైతన్య రిసెప్షన్‌ ఫొటోలను రిపోస్ట్‌ చేస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

చదవండి: తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ

‘చాలా కాలం క్రితం నాటి జ్ఞాపకాలు. ఇప్పుడు అవి లేవు. ఇకపై ఉండవు కూడా. కాబట్టి కొత్త కథ, కొత్త జీవితం మొదలు పెడదాం’ అని అని ఆయన రాసుకొచ్చారు. కాగా చై-సామ్‌ విడాకుల ప్రకటన అనంతరం ఆయన స్పందిస్తూ ఈ విషయం వినగానే తన మైండ్‌ బ్లాక్‌ అయ్యందంటూ భావోద్వేగానికి గురయ్యారు. చై-సామ్‌ విడాకుల విషయం వినగానే మొదట తనకు ఏం అర్థం కాలేదని, ఒక్కసారిగా కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు చెప్పినట్లు ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top