సొంత గొంతు | Adah Sharma Dubs Her Role In Telugu Movie | Sakshi
Sakshi News home page

సొంత గొంతు

Nov 3 2020 2:50 AM | Updated on Nov 3 2020 2:52 AM

Adah Sharma Dubs Her Role In Telugu Movie - Sakshi

పరభాషా హీరోయిన్లకు ఎక్కువ శాతం వేరే వాళ్లు డబ్బింగ్‌ చెప్పే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు తమ పాత్రలకు తమ గొంతునే వినిపించాలనుకుంటున్నారు. భాష నేర్చుకొని ఆ పాత్రకు మరింత న్యాయం చేయాలనుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ పాత్ర చేసిన హీరోయిన్లు డబ్‌ చేస్తేనే బావుంటుందని దర్శకులు భావిస్తే హీరోయిన్లు కూడా రెడీ అంటారు. తాజాగా అదా శర్మ తన గొంతును వినిపించడానికి రెడీ అయ్యారు.

‘?’(క్వొశ్చన్‌ మార్క్‌) అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో నటించారామె. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపిస్తారు అదా. ఈ చిత్రానికి ఆమె డబ్బింగ్‌ చెప్పాలనుకోవడం, దర్శక–నిర్మాతలు విప్రా, గౌరీకృష్ణ ఓకే అనడం జరిగిపోయాయి. ‘‘తెలుగు డైలాగులన్నింటినీ అదా హిందీలో రాసుకున్నారు. బాగా ప్రాక్టీస్‌ చేసి, చెప్పారు. రెండే రెండు రోజుల్లో డబ్బింగ్‌ మొత్తం పూర్తి చేశారు. ఆమె కమిట్‌మెంట్‌కి ఆశ్చర్యం అనిపించింది. అదా డబ్బింగ్‌ ఓ హైలైట్‌’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement