అందరిచూపు సౌత్‌వైపే.. ఇక్కడే పాగా వేస్తానంటున్న బ్యూటీ | Actress Yamini Malhotra Prepares For South Industry Comeback | Sakshi
Sakshi News home page

అప్పట్లో తెలుగులో ఓ మూవీ.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తానంటున్న బ్యూటీ

Jun 19 2025 5:29 PM | Updated on Jun 19 2025 5:29 PM

Actress Yamini Malhotra Prepares For South Industry Comeback

ఒకప్పుడు సౌత్‌ సినిమాలంటే చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలు దేశాన్నే ఏలుతున్నాయి. ఖండాలు దాటి ప్రపంచ సినిమాను తమవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. అందుకే సౌత్‌ సినిమాలు చేయడానికి హీరోయిన్లు కూడా నూతన ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీ బిగ్‌బాస్‌ 18 ఫేమ్‌, హీరోయిన్‌ యామిని మల్హోత్రా (Yamini Malhotra) కూడా దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

అన్నీ ప్రత్యేకమే
దంత వైద్యురాలు అయిన యామిని తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా బాలీవుడ్‌ బబుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ.. నేడు సౌత్‌లో చెప్తున్న కథలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్కడి కథలు, స్క్రీన్‌ప్లే, విజన్‌ కూడా అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బలమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సౌత్‌లోకి మరోసారి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని నాకనిపిస్తోంది.

ఎగ్జయిట్‌ అయ్యా.. కానీ!
తెలుగులో, పంజాబీలో చేసిన సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలైనప్పుడు చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. అయితే అప్పుడు పంజాబీ సినిమాపైనే ఎక్కువ మొగ్గు చూపాను. ఎందుకంటే ఆ భాష నాకు కంఫర్టబుల్‌గా అనిపించేది. తెలిసినవాళ్లు కూడా ఉండటంతో ఇక్కడ ఎదగడం ఈజీ అనుకున్నాను. భాష అడ్డంకి అనుకున్నాను. కానీ అది నిజం కాదని అనుభవంతో తెలుసుకున్నాను అని యామిని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 'చిల్‌ మార్‌ నా బ్రో' మూవీతో ఇటీవలే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

చదవండి: సౌత్‌లో మంచి రోల్స్‌ ఇవ్వలే? యాంకర్‌కు కౌంటర్‌ ఇచ్చిన జెనీలియా

Advertisement
 
Advertisement
Advertisement