ఒక అమ్మాయిని బూతులు తిట్టే హక్కు ఉందా?: ఏడ్చేసిన నటి | Sakshi
Sakshi News home page

Soumya Janu: 'మందు తాగే అలవాటు లేదు.. ఆ ఘటనతో మంచినీళ్లు తాగలేకపోయా'

Published Fri, Mar 1 2024 4:22 PM

Actress Sowmya Clarity On Wrong Route Issue with Traffic Conistable - Sakshi

ఇటీవల హైదరాబాద్‌లో నటి సౌమ్య జాను ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా ట్రాఫిక్ హోంగార్డ్‌తో జరిగిన గొడవ కాస్తా పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఈ నెల 24న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని అగ్రసేన్‌ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ హోంగార్డు.. జాగ్వార్‌ కారులో రాంగ్‌రూట్‌లో వచ్చిన సౌమ్యను అడ్డగించారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

అయితే ఈ వ్యవహారంపై తాజగా నటి సౌమ్య జాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ సమయంలో తాను రాంగ్‌ రూట్‌లో వెళ్లినట్లు తెలిపింది. కానీ ట్రాఫిక్ పోలీస్ వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని వివరించింది. తాజాగా ఓ ‍యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగిన సంఘటన గురించి అసలు నిజాలు చెప్పుకొచ్చింది.

సౌమ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' అసలు నా గురించి వీడియో సోషల్ మీడియాలో వస్తున్న సంగతే తెలీదు. ఇక్కడ పెద్ద బ్లండర్‌ ఎంటంటే.. నాకు మందు అలావాటే లేదు. నేను రాంగ్‌లో రూట్‌లోనే వెళ్లా. దీనికి సారీ చెబుతున్నా. నేను మెడిసిన్స్‌ కోసం వెళ్తున్నా.  ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా మదర్‌కు మందులు అర్జెంట్‌గా కావాలి. ఆ విషయం అతనికి కూడా చెప్పాను. కానీ వినకుండా కారు వెనక్కి తీయమన్నారు. తను చాలా ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యాడు. నాతో చాలా అసభ్యంగా మాట్లాడాడు. కానీ ఆ ఒక్క బూతు మాట నేను తీసుకోలేకపోయాను. రెండు రోజుల నుంచి మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నా. ఆ మాటలకే నాకు కోపం వచ్చింది.   అసలు ఆ మాట అనడానికి అతనికి నోరెలా వచ్చిందో నాకు తెలియట్లేదు. ప్రతి మగాడు.. ఒక ఆడదాన్ని అలా ఎందుకంటాడు.' అంటూ ఏడ్చేసింది. 

సౌమ్య మాట్లాడుతూ..'ఒక అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు. కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. అయిన వాళ్లను అనే హక్కు ఎవరికీ లేదు. మన సమాజంలో గేలు కూడా ఉంటారు. వాళ్లను ఉద్దేశించి ఎవరికీ అనే హక్కు లేదు. ఎందుకంటే ఆ దేవుడు వారికి అలాంటి లైఫ్ ఇచ్చాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆ మాటలు నన్ను ఎలా అంటారు. అక్కడ నేనేం నానా హంగామా చేయలేదు. కావాలంటే సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది. నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీ. కానీ అతను అన్న మాటలకు నా కుటుంబం నరకం అనుభవిస్తున్నాం. నా ఫ్రెండ్స్‌ ఫోన్ చేసి ఎంటి ఇలా అయింది? అని అడుగుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. ఆ రోజు నాకు మా అమ్మ ఆరోగ్యమే ముఖ్యం. అందుకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. నేను ఎక్కడికీ పోలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. అతను చేసింది మాత్రం చాలా తప్పు. దీనిపై ఎంతవరకైనా పోరాడతా'  అని అన్నారు. 


 

Advertisement
Advertisement